తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాక రేపుతున్నాయి. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం గతంలో ఎప్పుడు లేనంతగా హోరెత్తుతోంది. పార్టీల నేతల మధ్య వ్యక్తిగత దూషణలు హద్దులు మీరుతున్నాయి.  పరస్పర సవాళ్లతో రెచ్చిపోతున్నారు లీడర్లు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తన మాటల్లో మరింత పదును పెంచారు. కేంద్రం తమకు నిధులు ఇవ్వడంలేదంటూ బీజేపీపై విమర్శలు చేసిన కేటీఆర్ కు ఆయన కౌంటరిచ్చారు. కేంద్రం ఏమీ ఇవ్వడంలేదని కేటీఆర్ అంటున్నారని, అన్నీ ఇచ్చాక వీళ్లు పొడిచేది ఏమిటని అన్నారు. కేంద్రం నిధులు లేనిదే ఏ పథకం ముందుకు కదిలే పరిస్థితి లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు.

20 లక్షలు ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే కేసీఆర్ కు తోమాల సేవ చేస్తానని, నిరూపించకుంటే బడితె పూజ చేస్తానని బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్, పీవీ ఘాట్ లను కూల్చుతామని ఒవైసీ అంటే కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఓట్లు అడిగే హక్కు కేసీఆర్ కు లేదన్నారు బండి సంజయ్. అలాంటి పార్టీకి ఎందుకు ఓట్లేయాలని అన్నారు భారత్ బయోటెక్ సందర్శనకు ప్రధాని నరేంద్ర మోడీ.. హైదరాబాదు వస్తే కేసీఆర్ ఎందుకు బయటకు రాలేదని నిలదీశారు బండి సంజయ్. తెలంగాణ అభివృద్ధిపై కేసీఆర్ కు చిత్తశుద్ది లేదన్నారు. తన కుటుంబ ఆస్తులు పెంచుకోవడంపైనే ఆయన ఫోకస్ చేశారని సంజయ్ ధ్వజమెత్తారు.

సీఎం పదవి ఎడమకాలి చెప్పుతో సమానమని, సీఎం కేసీఆర్‌ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తప్పుబట్టారు. వికారాబాద్‌లో కిషన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లీస్ లేకుంటే టీఆర్‌ఎస్‌కి సీంగిల్ డిజిట్ మాత్రమే వచ్చేదన్నారు. టీఆర్ఎస్ కోత్త వ్యక్తిని తెచ్చారని ఓడిపోతామని తెలిసి వాణీదేవిని బలిపశువును చేశారని విమర్శించారు. వాణీదేవికి పదవి ఇవ్వాలంటే రాజ్యసభకు పంపించాల్సిందని కిషన్‌రెడ్డి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: