ఆత్మనిర్భర భారత్.. ఇది తరచూ ప్రధాని మోడీ వాడే పదం.. అంటే అన్ని రంగాల్లోనూ స్వయంసమృద్ధి సాధించిన భారత్‌ అని.. కానీ.. ఈ పదం చెబుతూ మోడీ ఇటీవల అన్నీ ప్రైవేటుపరం చేస్తానంటున్నారు. మరి ఒక్కసారి గతం చూసుకుంటే.. 1954 లో ఉక్కు ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం కోసం SAIL ని స్థాపించారు. 1956 లో ఇంజనీరింగ్ విద్యలో స్వయం సమృద్ధి సాధించడం IIT లని స్థాపించారు. 1956 లో వైద్యరంగంలో స్వయం సమృద్ధి సాధించడం కోసం AIIMS ని స్థాపించారు. 1958 లో రక్షణ సాంకేతిక రంగంలో స్వయం సమృద్ధి సాధించడం కోసం DRDO ని స్థాపించారు.

1964 లో వైమానిక రంగంలో  స్వయం సమృద్ధి సాధించడం కోసం HAL ని స్థాపించారు. 1965 లో ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధించడం కోసం హరిత విప్లవాన్ని తెచ్చారు.1965 లో ఎలక్ట్రికల్ వస్తువుల ఉత్పత్తి రంగంలో స్వయం సమృద్ధి సాధించడం కోసం BHEL ని స్థాపించారు. 1969 లో అంతరిక్ష రంగంలో స్వయం సమృద్ధి సాధించడం కోసం isro ని స్థాపించారు. 1975 లో బొగ్గు ఉత్పత్తి రంగంలో స్వయం సమృద్ధి సాధించడం కోసం CCL ని స్థాపించారు. 1975 లో విద్యుదుత్పత్తి రంగంలో స్వయం సమృద్ధి సాధించడం కోసం NTPC ని స్థాపించారు.

1984 లో గ్యాస్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం కోసం GAIL ని స్థాపించారు. 1990 లో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో స్వయం సమృద్ధి సాధించడం కోసం సాఫ్ట్‌వేర్‌ పార్కును సృష్టించారు. ఇలా ఈ జాబితా కొనగుతూనే ఉంది. అయితే.. 2014 లో వచ్చిన బీజేపీ సర్కారు మాత్రం "స్వయం సమృద్ధి"ని సాధించాలంటే.. వాటినన్నిటినీ అమ్మేయాలని.. కార్పొరేట్లకు కట్టబెట్టాలని చెప్పడం విడ్డూరంగా కనిపిస్తోంది. భారత్ మాతాకీ జై అంటూ ...భరతమాత వంటిమీద అభర్ణాలుగా ఉన్న ప్రజా సంపదని ప్రైవేటు వ్యక్తుల పరం చేయడం ఎలాంటి ఆత్మ నిర్భర భారతో అర్థం కాలేదంటున్నారు విశ్లేషకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: