ఎన్నికల్లో విపక్షాలు లేకుండా చూడాలని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని.. ఇలాంటి చర్యలు ఎక్కువ రోజులు సాగవని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఇవాళ టీడీపీ నేతలతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాని మోదీ అనేక రకాల వేషాలు వేస్తున్నారని.. అలాగే రాష్ట్రంలో కూడా జగన్ ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అసలు కేంద్రంతో సీఎం జగన్ వైఖరి ఏంతొ సమాధానం చెప్పాలన్నారు. విశాఖలో వైసీపీ నేతలు పాదయాత్ర చేస్తారు.. ఢిల్లీ పాద పూజ చేస్తున్నారని విమర్శించారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటే.. అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయాలని.. ఈ విషయంలో సీఎం జగన్ వెంట నడిచేందుకు తాము సిద్ధమన్నారు. వాలంటీర్లు పోలీసులు ద్వారా ప్రజలను, అభ్యర్థులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సోమువీర్రాజు పొరుపాటున బయట ఉన్నారు.. ఆయన పిచ్చాసుపత్రిలో ఉండాల్సిందని అయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు వేసే హక్కు అంబేద్కర్ ఇస్తే దాన్ని కూడా వేయకుండా జగన్ ఓటర్లపై దౌర్జన్యం చేస్తున్నాడని నారాయణ ఆరోపించారు.

ఎన్నికలు జరగకుండా నామినేట్  చేసే పద్ధతులు చేసుకోవాలని సీఎం జగన్ కు నారాయణ సలహా ఇచ్చారు. పెట్రోల్ పై కేంద్ర ప్రభుత్వానికి 20 లక్షల కోట్లు ఆదాయం వస్తే దాన్ని ఏం చేశారో తెలియదు మళ్లీ మళ్లీ పెట్రో బాదుడు బాదుతున్నారని విమర్శించారు.మోడీ ప్రైవేట్ సెక్టారుకు అమ్మేస్తుంటే ఎదిరించే సత్తా లేని జగన్ వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఉన్నాయని ఆయన విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: