ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పెరిగిపోతుండటం ఆధునిక జీవనశైలికి అందరూ అలవాటు పడుతూ ఉండడంతో ఇక.. ఎవరు కూడా ప్రకృతిని కాపాడేందుకు అంత ఆసక్తిని చూపడం లేదన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చెట్లను నరుకుతూ బిల్డింగులు నిర్మిస్తున్నారు తప్ప చెట్లను నాటి మానవాళి మనుగడను కాపాడాలని మాత్రం ఎవరూ అనుకోవడం లేదు. ఈ క్రమంలోనే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేసి ఏకంగా మానవాళికి ముప్పు వాటిల్లే  ముందే పర్యావరణాన్ని రక్షించాలి అని సూచిస్తున్నారు.



 ఈ క్రమంలోనే ఇక దేశవ్యాప్తంగా కూడా విరివిగా చెట్లు నాటే విధంగా అందరికీ అవగాహన కల్పిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే కొత్తగా చెట్లు నాటుతూనప్పటికీ వాటి రక్షణ విషయంలో మాత్రం ఎవరూ అంతగా శ్రద్ధ తీసుకోవడం లేదు. అయితే నేటి ఆధునిక జీవనశైలిలో చెట్లను నరుక్కుంటూ బిల్డింగులు కడుతున్న కాలంలో కూడా అక్కడక్కడ పురాతనమైన చెట్లు దర్శనమిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఆ పురాతనమైన చెట్లను చూసినప్పుడు ఎంతో మంచి అనుభూతిని పొందుతూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఇక్కడ ఓ చెట్టు ఇలాంటి చరిత్రను కలిగి ఉంది.



 ప్రపంచంలోనే కొన్ని ప్రాంతాల్లో అత్యంత పురాతనమైన ఎక్కువగా పొడవు ఉన్న చెట్లు కూడా ఉన్నాయి. ఇక ఇటీవలే గుజరాత్ లో  అలాంటిదే. అక్కడ ఎంతో ప్రాచీనమైన చెట్లు ఇప్పటికీ ఉన్నాయి. అయితే ప్రపంచం లోనే అతి ఎత్తైన చెట్టు మాత్రం గుజరాత్లో లేదు. ఉత్తర అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం లోని  నేషనల్ పార్క్ లో ప్రపంచంలోనే అతి ఎత్తైన చెట్టు ఉంది. ఈ చెట్టు ఏకంగా 380 అడుగులు ఉంటుందట. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ.. ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే ఎంతో ఎత్తుగా ఉంటుందట ఈ చెట్టు. ఇక ఈ చెట్టు ఏకంగా గిన్నిస్ బుక్ లో కూడా రికార్డు సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: