తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా చండ్రనిప్పులు కురిపించారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మాటల తూటాలు పేల్చారు. అవసరమైతే తాను రౌడీలకు రౌడీనంటూ మాటకు మాట.. తూటాకు తూటాతోనే బదులిస్తానని స్పష్టం చేశారు. రోడ్షోలో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డ చంద్రబాబును చూసి ఆశ్చర్యపోవడం పార్టీ నేతలవంతైంది. ఒకరకంగా ఆ మాటల తూటాలతో అభ్యర్థులతో ఉత్సాహాన్ని నింపారు.

బెజవాడ రోడ్షోలో చంద్రబాబునాయుడు వాడిన పదజాలం ఒకసారి పరిశీలిద్దాం... విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో కొబ్బరి చిప్పలు, అమ్మవారి చీరలను దొంగలించి అమ్ముకునేవాడు దేవదాయ శాఖ మంత్రా? ఆయన హయాంలో దుర్గగుడిలో అవినీతి కంపు కొడుతోంది. అమ్మవారి వెండి రథంపై మూడు సింహాలు మాయమైనా ఇంతవరకు వాటి అతీగతీ లేదు. రామతీర్థంలో రాముడి తల నరికేసినా పట్టించుకోడు. జగన్మాత కనకదుర్గమ్మ కొలువైన స్థానంలో అవినీతి కంపు కొడుతుంటే మీకు రోషం రావడం లేదా? నాపై అభిమానం లేకపోయినా.. కనీసం ఆ దేవతపైనైనా అభిమానం చూపించండి. అమ్మవారి రథంపై వెండి సింహాలు మాయమైపోతే మీకు కనబడలేదా? ఆ తల్లి కన్నెర్రజేస్తే తప్ప మీరు కళ్లు తెరవరా? ఏమైంది మీ రోషం? ఏమైంది తెలుగువారి ఆత్మగౌరవం?

బూతుల మంత్రి
ఇదే జిల్లాలో ఇంకొకడున్నాడు. వాడు బూతుల మంత్రి. వాడి మనుషులతో పేకాట ఆడిస్తాడు. పోలీసులు పట్టుకుంటే సిగ్గుపడాల్సిందిపోయి.. పేకాడితే తప్పేంటని అంటాడు. పోలీసులు కేసు పెడితే జరిమానా కట్టి మళ్లీ పేకాట ఆడకుంటామంటాడు. పేకాట ఆడుకోవడానికి ముఖ్యమంత్రి అనుమతి ఇస్తాడు. పుంగనూరు పుడింగి కృష్ణా జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్నాడు. ఈ పుడింగికి కృష్ణానదిలో కొంత భాగాన్ని, ఇంకో మంత్రికి మరో బిట్టును ఇచ్చి  మొత్తం దోచుకుంటారంట!

నా రాజకీయ జీవితంలో ఈ గుమస్తా ఎంత?
రెండేళ్లుగా ఇసుక దొరకకుండా మొత్తం బయట అమ్ముకుంటున్నారు. పక్క జిల్లాలో మరో హవాలా మంత్రి ఉన్నాడు. వీళ్లంతా మంత్రులా? జగన్ బంట్రోతులు. జగన్ పత్రికలో గుమాస్తాగా పని చేసిన వ్యక్తి నాకు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. నా రాజకీయ జీవితంలో ఈ గుమాస్తా ఎంత? ఇలాంటి వారిని చాలామందినే చూశాను. బెదిరింపులకు భయపడేవాడిని కాదు. విశాఖపట్నంలో 10 వేల ఎకరాల భూములను ఏ-2 కబ్జా చేశాడు. అక్కడ కోటీశ్వరుల ఆస్తులను భయపెట్టి రాయించుకుంటున్నాడు. వ్యాపారులు, కాంట్రాక్టర్లను బెదిరించి వసూళ్లు చేస్తున్నాడు. మొత్తం ఆంధ్రప్రదేశ్ను నేరస్థులకు అడ్డాగా మార్చేశారు. రాష్ట్రం వాళ్లబ్బ జాగీరనుకుంటున్నారా? ‘

మరింత సమాచారం తెలుసుకోండి: