కర్ణాటకలో ఓ మంత్రి రాసలీలల వీడియో కలకలం రేపుతోంది. ప్రజా ప్రతినిధిగా ప్రజలకు అండగా ఉండాల్సిన కర్ణాటక ఇరిగేషన్‌ మంత్రి రమేష్‌ జర్కిహోలి ఓ యువతితో చనువుగా ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. భాధ్యత గల పదవిలో ఉన్న ఆయన ఏదో సెలబ్రెటీ లాగా ఫోటోలకు ఫోజులు ఇచ్చి , నగ్న దేహం తో ఉన్న ఫోటోలను షేర్ చేయడం అందరిని ఆలోచనలో పడేసింది. కాగా, యువతి ఉద్యోగం విషయమై కొద్ది రోజుల కిందట మంత్రి రమేశ్ వద్దకు వచ్చింది. అయితే సదరు మంత్రి ఆ యువతిని లొంగదీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా యువతితో మంత్రి చనువుగా ఉన్న ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో ఈ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
 

కర్ణాటక అధికార ప్రభుత్వం పై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జర్కిఘోళి సెక్స్ సీడీ కేసులో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ సంచలన సీడీని బయటపెట్టిన సామాజిక కార్యకర్త దినేష్ కళ్లహళి తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన తరఫున న్యాయవాది పోలీసులను కలిశారు. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన న్యాయవాది.. తన క్లయింట్ దినేష్ కళ్లహళి.. కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జర్కిహోళిపై పెట్టిన కేసును వెనక్కు తీసుకోవాలని అనుకుంటున్నట్టు తెలిపారు. బాధితురాలి క్షేమం, సమాజం క్షేమం కోసం తాను కేసును విత్ డ్రా చేసుకుంటున్నట్టు చెప్పారు.


మంత్రి రాజీనామా లేఖను సీఎం బీఎస్ యడియూరప్పకు రెండు రోజుల క్రితం పంపారు. తన వద్దకు ఓ పని కోసం వచ్చిన ఓ మహిళను మంత్రి రమేష్ జర్కిహోళి లైంగికంగా వాడుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. బెంగళూరులోని ఆర్‌టీ నగరలో నివాసం ఉండే యువతి రాష్ట్రంలోని డ్యామ్‌లను డ్రోన్‌ కెమెరా ద్వారా చిత్రీకరించి డాక్యుమెంటరీ తీసేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రిని ఆశ్రయించింది. దీని కోసం ఆయన లైంగికంగా వాడుకున్నారని ఆరోపణ..దినేష్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పిటిషన్ విత్ డ్రా చేసుకోవడానికి దినేష్ ముందుకు రావడంతో దాన్ని పై అధికారులతో పరిశీలించి, న్యాయనిపుణులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని పోలీసులు చెప్పారు. ఇకపోతే యువతికి ఉద్యోగాన్ని కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.. అంతేకాదు ఆమె ఇష్టపడి అతనితో గడిపిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదీ ఏమైనా ఈ విషయం కొలిక్కి వచ్చేవరకు  ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: