తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్-09న పార్టీ పేరు ప్రకటించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమం లో పలువురు ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖులు షర్మిలను కలిసి పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు షర్మిలతో భేటీ కలిసి ఆమెకు సపోర్ట్ చేశారు.. రాజన్న బిడ్డగా ఆమె చేసిన ఆలోచన బాగుందని కితాబు ఇచ్చారు.  ఇప్పటికే పార్టీ పేరూ కూడా ఖరారు అయినట్లు తెలుస్తోంది.
 

ఆమె పార్టీ పేరు ఎలా పెడుతుంది.. ఎవరెవరు అగ్ర నేతలుగా ఉంటారు.. ఇలా రక రకాల ప్రశ్నలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రజల్లో ఈ విషయం హాట్ చర్చగా మారుతుంది.షర్మిల పార్టీ పై రాజకీయ పక్షాలు పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ మొదలుకొని పలువురు షర్మిల పార్టీపై స్పందిస్తున్నారు. అయితే మెజార్టీగా చూస్తే షర్మిల పార్టీని స్వాగతించే వారి సంఖ్య స్వల్పంగా కనిపిస్తోంది. తెలంగాణ లో ఆమె రాణించ లేరని పలువురు విశ్లేషిస్తున్నారు.


సీఎం జగన్, షర్మిల మధ్య విబేధాలు వచ్చాయని, అందువల్లే ఆమె స్వంత పార్టీని పెడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. జగన్, షర్మిలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యం లోనే నటుడు krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి స్పందించారు. షర్మిలకు జగన్ ఎటువంటి అన్యాయం చేయలేదని స్పష్టం చేశారు. అలా చేసి ఉంటే ఎపీ లోనే షర్మిల పోటీకి వచ్చే వారు కదా అని ప్రశ్నించారు. షర్మిల ఎదగాలనే తెలంగాణ లో పార్టీ పెడుతున్నారని, అయితే తప్పేంటి అని పోసాని కృష్ణ మురళి ప్రశ్నించారు...ఏదీ ఏమైనా షర్మిల పార్టీ పై రాజకీయ చర్చలు జోరుగా సాగుతున్నాయి. రేపు షర్మిల పార్టీ పేరును అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: