విశాఖ మహా నగరపాలక సంస్థ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. అధికార పక్షం వైసీపీకి ధీటుగా విపక్షం తెలుగుదేశం పార్టీ కూడా తొడకొడుతూండండంతో ఎన్నికలు రసకందాయంలో మారాయి. విశాఖ మేయర్ కుర్చీ కోసం నువ్వా నేనా అన్నట్లుగా రెండు పార్టీల సమరం సాగుతోంది.

ఇక విశాఖలో చూసుకుంటే టీడీపీకి నాయకుల కంటే కార్యకర్తల బలం ఎక్కువగా ఉంది. దాంతో పాటు ఎన్నోసార్లు కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన చరిత్ర కూడా ఉంది. ఇక స్ట్రాంగ్ బేస్ అనదగ్గ వార్డులు కూడా టీడీపీకి ఉన్నాయి. ఈ పరిణామాలే అధికార వైసీపీని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. విశాఖలో దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ గట్టి పోటీ ఇస్తోంది. ఇక్కడ ఉన్న 14 వార్డుల్లో ఒకటి రెండు తప్ప దాదాపుగా అన్ని చోట్లా అధికార వైసీపీని చమటలు కార్పించేలాగానే టీడీపీ వ్యూహాలు ఉన్నాయి. పాత కాపులైన టీడీపీ అభ్యర్ధులు రేసులో దూసుకుపోతున్నారు. ఇక్కడ చిత్ర్రమేంటంటే టీడీపీ నుంచి రెండవ సారి గెలిచి వైసీపీలోకి దూకిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సత్తాను అధికార పార్టీ నమ్ముకుంది. ఇక వాసుపల్లి కూడా గట్టిగానే శ్రమిస్తున్నారు కానీ టీడీపీ హవా బాగానే ఉండడంతో గెలుపు అవకాశాలు ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నట్లుగానే ఇక్కడ ఉన్నాయని అంటున్నారు.

అదే విధంగా వైసీపీని భయపెట్టే మరో నియోజకవర్గం విశాఖ గాజువాక. ఇక్కడే స్టీల్ ప్లాంట్ ఉంది. ఇక్కడే ఉక్కు సెగ రగులుతోంది. దాంతో పాటు ఎక్కువ సంఖ్యలో వార్డులు కూడా ఉన్నాయి. ఇక్కడ వామపక్షాలకు కూడా బలం ఉంది.  అలాగే  వైసీపీకి రెబెల్స్ కూడా ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. ఈ పరిణామాలతో ఇక్కడ ఎన్ని వార్డులు వైసీపీ కైవశం అవుతాయి అన్నది చెప్పలేకపోతున్నారు. చూడాలి మరి ఈ రెండు చోట్ల ఎక్కువ సీట్లు గెలుచుకుంటేనే వైసీపీ  మేయర్ ఆశలు నెరవేరేది అంటున్నారు. చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: