పంటల కనీస మద్ధతు ధర క‌ల్పించేలా చ‌ట్టాల‌ను రూపొందించాల‌ని డిమాండ్ చేస్తూ, కొత్త వ్వవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో చేస్తున్న పోరాటానికి 100 రోజులు పూర్త‌యిన విష‌యం తెలిసిందే.  శనివారాన్ని బ్గాక్ డే గా కూడా పాటించారు. కేంద్ర ప్ర‌భుత్వం ఉద్య‌మాన్ని ఆపేందుకు, నియంత్రించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న రైతు ఉద్య‌మం మాత్రం ఉధృత‌మ‌వుతూనే ఉంది. మ‌రోవైపు రైతుల శ్రేయస్సు కోసమే కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స‌మ‌ర్థించుకుంటున్నారు. ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 1.75 కోట్ల రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.1.15 లక్షల కోట్లను డిపాజిట్ చేశాం. అన్నదాతల ఆదాయాన్ని పెంచడంతోపాటు వ్యవసాయ రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై ప్రధాని మోడీకి స్పష్టమైన విజన్ ఉంది. రైతులు సుసంపన్నంగా ఉంటేనే దేశ ఎకానమీ కూడా పరుగులు పెడుతుంది. ఇక, కొత్త అగ్రి చట్టాల గురించి చెప్పాల్సి వస్తే.. ఇవి విప్లవాత్మకమైనవి’ అని తోమర్ చెబుతున్నారు.


అయితే ఇప్పటి వరకు వివిధ దశల్లో జరిగిన రైతు పోరాటాలు, పదుల సంఖ్యలో చర్చలు, శాంతియుత పోరాటాలు జరిగిన నేటికి రైతులు పోరాడుతున్న కొలిక్కి రాకపోవడంపై రైతులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. ఇప్పటికైనా త్వరితగతిన రైతుల సమస్యలపై ప్రభుత్వం వెనక్కి వచ్చి న్యాయం చేయాలని. సాగు చట్టాల్ని రద్దు చేసే వరకూ వెనకకు తగ్గేదిలేదని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయ‌త్‌ స్పష్టం చేశారు. లక్ష్యాన్ని సాధించడంతో ఇప్పటికిప్పుడు తాము విజయం సాధించకపోయినప్పటికీ రైతుల్లో ఐక్యత తీసుకురావడానికి ఈ ఉద్యమం దోహదపడిందని మరో నేత యోగేంద్ర యాదవ్ తెలిపారు.


 వ్యవసాయ కుటుంబాల్లోని యువకుల్లో ఈ ఉద్యమం గొప్ప మార్పు తీసుకువచ్చిందని ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ నేత కవిత కురుగంటి పేర్కొన్నారు. ఉద్యమం కారణంగా పంజాబ్‌లో యువత దురలవాట్లకు దూరమవుతున్నారని, మద్యం తాగడం తగ్గిందని పేర్కొన్నారు. అలాగే, మహిళా రైతులకు గుర్తింపు పెరిగిందని కవిత వివరించారు. ఇదిలా ఉండ‌గా ఆదివారం తాజాగా ఓ రైతు చెట్టుకు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.హరియాణాకు చెందిన 49 ఏళ్ల రాజ్‌బీర్‌ చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఆత్మహత్యకు కారణాలు తెలుపుతూ రాజ్‌బీర్‌ లేఖ కూడా రాశారు. నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోకపోవడమే తాను ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి కారణమని అందులో రాజ్‌బీర్‌ పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: