పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక చుట్టే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్ననీ తిరుగుతున్నాయి. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఈ ఎన్నికలు  హోరాహోరీగా సాగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈనెల 14న జరగనుండగా.. సాగర్ అసెంబ్లీ బైపోల్ ఏప్రిల్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. ఇటీవల వరుస పరాజయాలతో కుదేలైన అధికార పార్టీకి  ఈ ఎన్నికలు అత్యంత కీలకం. ఇటీవల వచ్చిన ఫలితాలు పునరావృతమయితే.. దూకుడు మీదున్న బీజేపీ నుంచి కారు పార్టీకి కష్టాలు తప్పవు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు నాగార్జున సాగర్ ను సవాల్ గా తీసుకున్నారు సీఎం కేసీఆర్. అభ్యర్థుల ఎంపికపైనా ఆయన సుదీర్ఘ కసరత్తు చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకత ఎదురవుతుందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి చేయించిన అన్ని సర్వేల్లోనూ నిరుద్యోగులు, ఉద్యోగులు.. టీఆర్ఎస్ పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని తేలిందట. ఇక సాగర్ లోనూ అభ్యర్థి ఎంపిక గులాబీ బాస్ కు సమస్యగా మారింది. యాదవ వర్గానికే ఇవ్వాలనే డిమాండ్. లోకల్ అంశం.. బలమైన ప్రత్యర్థి ఉండటం.. ఇవన్ని బ్యాలెన్స్ చేస్తూ అభ్యర్థిని ఖరారు చేయాల్సి వస్తోంది. అయితే రాజకీయ వ్యూహాల్లో దిట్టగా పేరున్న కేసీఆర్.. మరోసారి తన ఎత్తులకు పదును పెట్టారని తెలుస్తోంది. అందుకే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా.. మండలి ఎన్నికలను తమకు సానుకూలంగా చేసుకోవడంతో పాటు సాగర్ లోనూ గట్టెక్కేందుకు బ్రహ్మాస్తాన్ని బయటికి తీస్తున్నారని తెలుస్తోంది. కేసీఆర్ తాజా వ్యూహానికి విపక్షాలు చిత్తు కావడం ఖాయమనే ప్రచారం అప్పుడే మొదలైంది.

విపక్షాలకు షాకిచ్చేందుకు... తమ పార్టీని కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రయోగిస్తున్న బ్రహ్మాస్తమే.. ఏడు కొండలు యాదవ్. ప్రస్తుతం నాగర్ కర్నూల్ ఎక్సైజ్ సీఐగా పని చేస్తున్న ఏడుకొండలు.. సామాజిక విద్యావేత్త. వన్ మిషన్ ప్రొగ్రామ్ ద్వారా యువతకు ఆయన ఆరాధ్యుడు. తన మిషన్ ద్వాలా లక్షలాది మందికి ట్రైనింగ్ ఇస్తూ ఉద్యోగాలు సాధించేలా చూస్తున్నారు. ఆన్ లైన్ క్లాసుల ద్వారా లక్షలాది మందికి ఉచితంగానే పాఠాలు బోధిస్తున్నారు. 13 సబ్జెక్టులను అనర్గళంగా బోధించే ఏడు కొండలు యాదవ్.. క్లాసులు విని ఇప్పటికే వేలాది మంది ఉద్యోగాలు పొందారు. మరికొందరు అదే బాటలో ఉన్నారు. దాదాపు వందకు పైగా సెంటర్లలో ఏడు కొండలు యాదవ్ ఆన్ లైన్  వింటున్నారు యువకులు. ఢిల్లీ జేఎన్యూ విద్యార్థులు సైతం ఆయన క్లాసులు వింటున్నారంటే... ఆయన గొప్పతనమేంటో తెలుసుకోవచ్చు.

ఏడు కొండలు స్వగ్రామం నాగార్జున సాగర్ నియోజకవర్గంలోనే ఉంది. అందుకే ఏడుకొండలును సాగర్ బరిలో దింపాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది. నిఘా వర్గాలు కూడా ఏడు కొండలు పేరును సూచించాయని సమాచారం. ఏడుకొండలు బరిలోకి దింపితే.. సాగర్ లో సమస్యగా మారిన స్థానిక నినాదం.. యాదవునికే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ను నెరవేర్చవచ్చు. అంతేకాదు నియోజకవర్గంలో ఆయనపై ఉన్న అభిమానంతో.. యూత్ కూడా అధికార పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఏడు కొండలుకు టికెట్ ఇస్తే.. ఆయనను గెలిపించుకునేందుకు వేలాది మంది ఆయన శిష్యులు సాగర్ లో ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇంటింటికి తిరిగి.. ఓట్లు వేయించేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. ఇలా అన్ని అంశాలు కలిసివస్తుండంతోనే ప్రగతి భవన్ వర్గాలు.. ఏడు కొండలు అభ్యర్థిత్వంపై సీరియస్ గా వర్కవుట్ చేస్తున్నాయని తెలుస్తోంది.

  మరోవైపు మండలి ఎన్నికల్లో ఉద్యోగులు, నిరుద్యోగులు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే నిరుద్యోగుల్లో వేలాది మంది ఏడు కొండలు శిష్యులు ఉన్నారు. ఉద్యోగ వర్గాల్లోనూ ఆయనపై అభిమానం ఉంది. అందుకే మండలి పోలింగ్ కు ముందే ఏడు కొండలును అభ్యర్థిగా ప్రకటిస్తే.. ఆయన శిష్యులతో పాటు ఉద్యోగుల ఓట్లకు తమకే పడతాయనే ధీమాలో ఉన్నారట కేటీఆర్. ఏడు కొండలుకు టికెట్ ఇస్తే.. ఆయన విజయం సాధించడం ఖాయమనే చర్చ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జరుగుతోంది. అధికార పార్టీపై ఆగ్రహంగా ఉన్న ఉద్యోగులు, నిరుద్యోగులు కూడా ఏడుకొండలు కోసం పని చేసేందుకు సై అంటున్నారని తెలుస్తోంది. ఏడు కొండలు పేరు తెరపైకి రావడంతో కాంగ్రెస్, బీజేపీ నేతల్లో కలవరం కల్గుతుందని కూడా చెబుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: