భార‌తీయ రైల్వే ఆధునీక‌ర‌ణ బాట ప‌డుతోంది. విమానాశ్ర‌యాల‌కు ధీటుగా ప్ర‌ధాన స్టేష‌న్ల‌ను తీర్చిదిద్దాల‌న్న సంక‌ల్పంతో ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే అత్యాధునిక వ‌స‌తుల‌ను ప్ర‌యాణికుల‌కు క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇప్ప‌టికే ఎంపిక చేసిన స్టేష‌న్ల‌లో ఎక్స్‌క‌వేట‌ర్ల ఏర్పాటును వేగంగా సాగిస్తోంది. ఇక దాదాపు అన్నిచోట్ల మూడో ట్రాక్ నిర్మాణం ప‌నుల‌ను వేగిరం చేస్తోంది. రైళ్ల స్పీడును కూడా పెంచ‌బోతోంది. 2030నాటికి ప్ర‌ధాన రూట్ల‌లో హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి తెచ్చేలా చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ ఆధునీకిక‌ర‌ణ‌లో భాగంగానే మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దేశంలోని 4 వేల రైల్వే స్టేషన్‌లలో హైస్పీడ్‌ ప్రీపెయిడ్‌ ఇంటర్నెట్‌ అందిస్తున్నట్లు భారతీ రైల్వేకు చెందిన రైల్‌టెల్‌ సంస్థ ప్రకటించింది.



 దేశంలోని మొత్తం 5,950 రైల్వే స్టేషన్‌లలో వైఫై సదుపాయం ఉందని, ఇందులో ప్రీపెయిడ్‌ వైఫై సదుపాయం 4వేల స్టేషన్‌లలో లభిస్తుంది. రైల్వే స్టేషన్‌లలో ఎవరైనా ఉచితంగా వైఫైని ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని, కాకాపోతే.. మొదట 30 నిమిషాలు ఫ్రీగా వైఫై ఉపయోగించుకోవచ్చని, ఆ తర్వాత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఓటీపీ బెస్ట్‌ వెరిఫికేషన్‌ ద్వారా వైఫై అందిస్తోంది. ప్రస్తుతం 4 వేల రైల్వే స్టేషన్‌లలో పెయిడ్‌ వైఫై ని రైల్‌టెల్‌ ప్రారంభించింది.


 ఇందు కోసం వేర్వేరు ప్లాన్స్‌ ప్రకటించింది రైల్‌టెల్‌. స్మార్ట్‌ఫోన్‌లో ఓటీపీ బెస్ట్‌ వెరిఫికేషన్‌ ద్వారా వైఫై అందిస్తోంది. మొదట 30 నిమిషాల పాటు ఉచితమే. ఆ తర్వాత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. రైల్‌టెల్ ప్లాన్స్ చూస్తే ఒక రోజులో 5జీబీ డేటా వాడుకోవడానికి రూ.10 చెల్లించాల్సి ఉంటంది. ఒక రోజు 10జీబీ డేటాకు రూ.15, ఐదు రోజులకు 10జీబీ డేటాకు రూ.20, ఐదు రోజులు 20జీబీ డేటాకు రూ.30 చెల్లించాలి. ఇక 10 రోజులకు 20జీబీ డేటా కోసం రూ.40 చెల్లించాలి. 10 రోజులకు 30 జీబీ డేటా కోసం రూ.50 చెల్లించాలి. 30 రోజులకు 60 జీబీ డేటా కోసం రూ.70 చెల్లించాలి. ప్రయాణికులు తమ అవసరాలకు తగ్గట్టుగా ఈ ప్లాన్స్ ఎంచుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్, ఇ-వ్యాలెట్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసే సదుపాయం ఉంది. రైల్‌టెల్ లెక్కల ప్రకారం ప్రతీ నెల 3 కోట్ల మంది యూజర్లు రైల్వేస్టేషన్లలో వైఫై ఉపయోగిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: