ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు కు సంబంధించి ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. మద్యం ధరలను పెంచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తుంది అనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. మద్యం ధరలు ఇప్పుడు పెంచాలి అని భావించిన సరే అందుకు అనుగుణంగా పరిస్థితులు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కొన్ని కొన్ని విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మద్యం ధరల కు సంబంధించి త్వరలోనే తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయవచ్చు అని భావిస్తున్నారు.

అయితే ఇప్పుడు పాత బ్రాండ్లను రాష్ట్రంలో ప్రవేశపెట్టే విషయంపై ప్రభుత్వంలో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడున్న బ్రాండ్లను పూర్తిగా తొలగించే అవకాశాలు కూడా ఉండవచ్చు అని ప్రచారం జరుగుతుంది. ఎందుకు ఏంటనేది ఒకసారి చూస్తే ఇప్పుడున్నవి తాగుతుంటే ప్రజల ఆరోగ్యానికి కూడా కాస్త ప్రమాదకరంగానే ఉందనే ఆవేదన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో కొంత మంది బాధపడుతున్నారు. దీంతో వైన్ షాపుల వద్ద రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించే పరిస్థితి ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో కూలి పనులు చేసుకుంటూ జీవించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సాయంత్రానికి మద్యం తాగకపోతే ప్రశాంతంగా నిద్రపోలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి తరుణంలో ఈ  మద్యం అందించడం ద్వారా సమస్యలు తీవ్రమవుతున్నాయి. అందుకే ముఖ్యమంత్రి జగన్ దీని మీద దృష్టి పెట్టారని రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడంతో ఆయన చర్యలకు దిగుతున్నారని అంటున్నారు. ఇప్పటికే కొంతమంది ద్వారా ఆంధ్రప్రదేశ్ లో మద్యం విషయంలో ఉన్న సమస్యలను తన వద్దకు నివేదికలు తెప్పించుకుని ఆయన పరిశీలిస్తున్నారని అవసరమైతే ఇప్పుడున్న బ్రాండ్లను పూర్తిగా రద్దు చేసి గతంలో ఏవైతే ఉండేవో వాటిని మళ్ళీ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. దీనికి సంబంధించి ఆయన కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: