విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార వైసీపీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. కొన్ని కొన్ని సమస్యలు మాత్రం అధికార పార్టీకి ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా రెండు నియోజకవర్గాల్లో పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశాలు కనపడటం లేదు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పార్టీకి ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా సరే మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం కొన్ని సమస్యలు అధికార పార్టీని వేధిస్తున్నాయి. ప్రధానంగా స్థానిక నాయకత్వం పార్టీకి దూరంగా జరిగింది అనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి.

ఒకరిద్దరు నేతలు కారణంగా విజయవాడలో వైసీపీ మీద అవినీతి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. జరుగుతున్న వాస్తవాలు కూడా ప్రజల్లోకి వెళ్లడంతో ఇప్పుడు అధికార పార్టీ నేతలు కాస్త ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. క్షేత్రస్థాయి ఇబ్బందులను అధికార పార్టీ అగ్రనేతలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రచారం చేస్తున్న సరే కొంతమంది స్థానిక నేతలు పార్టీ కోసం ముందుకు వచ్చే ప్రయత్నం చేయటంలేదు. 2019 ఎన్నికల తర్వాత తమను పార్టీ నుంచి పక్కన పెట్టారు అని భావిస్తున్న చాలా మంది నేతలు పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నాలు చేయకపోవడం పట్ల ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

ఇక టీడీపీ అధినేత అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్న సరే ఇక్కడ మాత్రం వైసీపీ అగ్ర నేతలు ఎవరూ కూడా ప్రచారం చేయడానికి ముందుకు రావడం లేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే ఇప్పుడు ప్రచారం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం లేకపోవడం విజయవాడ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థి గారు కూడా పార్టీ కోసం ముందుకు రాకపోవడంతో కాస్త ఇబ్బందికర పరిణామాలు ఉన్నాయనే చెప్పాలి. మరి వీటిని అధికార పార్టీ ఏ విధంగా ఎదుర్కొని నిలబడుతుంది ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: