ఒక 73 ఏళ్ల వృద్ధుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఒక లేడీ బ్యాంకర్ అతనికి సంబంధించిన సుమారు కోటిన్నర రూపాయల సొత్తు అపహరించి మోసం చేసింది. మహారాష్ట్రలోని ముంబైలో జరిగిన ఈ ఘటన ఆసక్తికరంగా మారింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని మసాద్ అనే ప్రాంతానికి చెందిన డిసౌజా అనే వృద్ధుడు సుమారు పదేళ్ల క్రితం తన తండ్రి నుంచి తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని విక్రయించాడు. దీంతో సుమారు రెండు కోట్ల రూపాయలకు పైగా సొత్తు లభించింది. దీంతో ఆయన రెండు కోట్ల రూపాయలు ఒక ప్రైవేటు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. సదరు బ్యాంకు లో వడ్డీ డ్రా చేసేందుకు ఈ మధ్య కాలంలో అక్కడికి వెళ్ళాడు. ఆయన వడ్డీ విత్ డ్రా చేస్తున్న సమయంలో అదే బ్యాంకు లో పని చేసే షాలిని అనే మహిళ ఈ వృద్ధుడి మీద కన్నేసింది. 

వృద్ధుడు ఒక్కడే నివాసం ఉంటున్నారు అన్న సంగతి గ్రహించి అతని ట్రాప్ చేయాలని భావించింది. మొదట ఆయనతో స్నేహం చేయడం ప్రారంభించి నెమ్మదిగా పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. తనకు వృద్ధాప్యంలో మంచి తోడు దొరికినందుకు ఆయన కూడా ఆనందించాడు. ఇక ఇద్దరూ కలిసి కొత్తగా పెళ్లైన జంట లాగా సినిమాలు షికార్లకు వెళ్ళేవాళ్ళు. ఆమె కూడా బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఉండడంతో ఆయన పూర్తిగా నమ్మేశాడు. అదీకాక వీరిద్దరూ బయటికి వెళ్లే సమయంలో ఆమె ఖర్చు పెడుతూ ఉండడంతో ఆయన ఆనందంతో పొంగిపోయాడు.

 కొన్నాళ్ల తర్వాత తాను ఒక వ్యాపారం పెడుతున్నానని దానికోసం ఇన్వెస్ట్మెంట్ ఇస్తే వచ్చే లాభాలు ఇద్దరం పంచుకుందాం అని ఆమె నమ్మించింది. ఆమె మాటలను నమ్మిన వృద్ధుడు దాదాపు కోటి 30 లక్షలకు పైగా ఆమెకు ట్రాన్స్ ఫర్ చేశారు. ఎప్పుడైతే వృద్ధుడి నుంచి డబ్బు తన ఖాతాలో పడిందో వెంటనే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకున్న సదరు బ్యాంకు ఉద్యోగిని ఉద్యోగానికి కూడా రాకుండా అడ్రస్ సహా ఫోన్ నెంబర్లు అన్ని మార్చేసింది. తాను మోసపోయానని తెలుసుకున్న వృద్ధుడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసుల దర్యాప్తులో తేలింది ఏమిటంటే ఈ వృద్ధుడి దగ్గర దోచుకున్న డబ్బుతో సదరు మహిళ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని మన ఊర్లో సెటిల్ అయిందట. ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: