అసలే ఎండలు మండిపోతున్నాయి కదా.. చల్లగా కూల్ డ్రింక్ తాగితే పోలా అని అనుకునే వాళ్ళు చాలామందినే ఉంటారు. కానీ అలాంటి శీతల పానీయాలు కన్నా  ఉత్తమ మైనది మారేదన్నా ఉంది అంటే అవి కొబ్బరి నీళ్లు అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.ఎందుకంటే కొబ్బరినీళ్లలో ఎలాంటి రసాయనాలు కలపరు. అవి సహజసిద్ధంగా దొరికుతాయి కాబట్టి ఆరోగ్యానికి ఎంతో  శ్రేష్ఠమైనవి.అసలు కొబ్బరి నీళ్లు తాగడం వలన ఎన్ని ఉపయోగంలో తెలుసుకోండి. కొబ్బరి బోండాం నీటిలో అత్యధికంగా కేలరీలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి. కాపర్‌ వంటి మినరల్స్‌ ఉండటంతో గుండెకు ఎంతో మంచిది. మీ డైట్‌లో కొబ్బరి నీళ్లను భాగం చేసుకుంటే శారీరకంగా ఎంతో దృఢంగా, నాజూకుగా తయారు కావచ్చని నిపుణులు అంటున్నారు.



కొబ్బరి నీళ్లను తాగడం వల్ల పొట్ట నిండిన భావన కలిగి అతిగా తినడం మానేస్తాం. ఇందులో ఉండే ఫైబర్‌ బరువు తగ్గేందుకు సాయమవుతుంది. కొలెస్ట్రాల్‌ స్థాయిని కొబ్బరి నీళ్లలోని పోషకాలు అదుపులో ఉంచుతాయి.గుండె జబ్బులకు కారణమైన బెల్లీ ఫ్యాట్‌ తగ్గాలంటే స్వచ్ఛమైన కొబ్బరి నూనె వాడటం మేలని నిపుణులు సూచించారు.తాజా లేత కొబ్బరి నీటిలో అనేక సూక్ష్మ పోషకాలు ఉంటాయి. లేత కొబ్బరి నీటిలో అత్యధికంగా లభించే పొటాషియం, తగిన స్థాయిలో సోడియం ఆల్కలైన్ సమతుల్యతను క్రమబద్ధీకరించి రక్తపోటు తగ్గించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నీటిలో చక్కెరలు ప్రధానంగా ఉంటాయి. కొబ్బరి బాగా ముదిరిన తరువాత నీటిలో చక్కెర శాతం పడిపోతూ ఉంటుంది కాబట్టి డయాబెటిస్ ఉన్న వాళ్ళు లేత కొబ్బరి కాకుండా కొంచెం ముదిరిన కొబ్బరి నీటిని తాగడం మంచిది.


అలాగే కొబ్బరి నీళ్లు వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది..గర్భవతులకు మలబద్దకం, జీర్ణకోశంలో తేడాలు,  గుండెలో మంట లాంటి సమస్యలు ఉంటే కొబ్బరి నీరు తాగడం ద్వారా అధిగమించవచ్చు కాబట్టి గర్భవతులు, పాలు ఇచ్చే తల్లులు కొబ్బరి నీళ్ళను వీలున్నప్పుడల్లా తాగుతూ ఉండాలి.అలాగే బిడ్డ ఆరోగ్యానికి తల్లులు తాగే కొబ్బరి నీరు ఎంతగానో సహకరిస్తుంది. బిడ్డకు పాలు ఇచ్చే తల్లులు కొబ్బరి నీటిని తాగితే పాల ద్వారా వారి బిడ్డలకు అనేక పోషకాలు అందుతాయి,

మరింత సమాచారం తెలుసుకోండి: