ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణం మరికొన్ని రోజుల్లో జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఆ అయోధ్య రామమందిర నిర్మాణం  వేల కోట్లతో చేపట్టాలని నిర్ణయించిన అయోధ్య రామమందిర ట్రస్టు దీని కోసం దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా వివరాలు సేకరించాలని నిర్ణయించిన  వెంటనే అటు దేశ వ్యాప్తంగా ఎంతోమంది అయోధ్య రామమందిర నిర్మాణానికి వివరాలు అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.



 ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు ప్రజాప్రతినిధులు సైతం అయోధ్య రామ మందిరానికి భారీగా విరాళాలు అందజేశారు అన్న విషయం తెలిసిందే. మరోవైపు హిందూ ముస్లిం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అయోధ్య రామ మందిరానికి విరాళాలు అందజేసి మత సామరస్యాన్ని చాటుకున్నారు. ఈ క్రమంలోనే రికార్డు స్థాయిలో అయోధ్యలో రామాలయ నిర్మాణానికి విరాళాల వచ్చాయి అన్న విషయం తెలిసిందే. అతి తక్కువ కాలంలో ఎక్కువ విరాళాలు సాధించి అయోధ్య రామమందిరం కొత్త రికార్డును నెలకొల్పింది.



 అంతేకాదు అతి ఎక్కువ మంది స్వచ్ఛందం గా విరాళాలు అందించిన ఆలయంగా కూడా అయోధ్య రామాలయం రికార్డు సాధించింది. ఇప్పుడు మరికొన్ని రికార్డులు కూడా అయోధ్య రామ మందిరం సృష్టిస్తోంది. ఏకంగా అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం 9 లక్షల మంది వాలంటీర్లు పని చేస్తున్నారట. ఒక లక్షా 75 వేల బృందాలు కూడా పని చేస్తున్నాయి.  38125 బ్యాంకు డిపాజిట్లు ఉండగా.. 49 కంట్రోల్ రూమ్ లూ.. మొత్తంగా చూసుకుంటే 2500 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చాయి. ఇలా అయోధ్య రికార్డులు సృష్టిస్తూ ఉండగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల బాధ్యతాయుతమైన ఐక్యత అయోధ్య రామాలయం విషయం లో స్పష్టం గా అర్థమవుతోందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: