సాధార‌ణంగా  ఉద్యోగం చేసే మహిళలు ఒకపక్క ఇంటి పనులు చక్కబెడుతూనే, పిల్లలు, ఇంట్లో వాళ్ళ అవసరాలు తీర్చుతూ బయట ఉద్యోగాలకు వెళుతూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇంటిలో పసి పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేని కొన్ని సంద‌ర్భాల్లో త‌మ పిల్ల‌ల‌ను కూడా త‌మ‌తో పాటు ప‌నిచేసే ఆఫీస్ లకు తీసుకుని  వ‌స్తుంటారు. అయితే ఒక మహిళా ఉద్యోగి కూడా అలాగే తన బిడ్డని తనతో పాటు పనిచేసే చోటుకు తీసుకుని వచ్చి ఎండను సైతం లెక్కచేయకుండా అలాగే భుజం మీద ఎత్తుకుని మరి తన డ్యూటీ తాను చేసింది. ఇప్పుడు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



వివరాలలోకి వెళితే  చండీగ‌ఢ్‌లోని సెక్టార్ 15/23లో ప్రియాంక అనే మహిళ  ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ తన చంటి బిడ్డ‌ను ఎత్తుకుని ర‌హ‌దారిపై ఎండను సైతం లెక్కచేయకుండా అక్కడ దుమ్ములో డ్యూటీ చేస్తుండ‌డాన్ని కొంద‌రు దారిన పోయేవారు గమనించి వీడియో తీశారు. ఈ క్ర‌మంలో ఆ వీడియో కాస్త నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. ఇది చుసిన  నెటిజన్లు ఆమెకు ఫీల్డ్ డ్యూటీ వేసిన పోలీసు ఉన్న‌తాధికారులపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. పసిబిడ్డ తల్లి అని కూడా చూడకుండా ఉద్యోగం చేయిస్తున్నారు అని మండి పడుతున్నారు. ఆమెకు డెస్క్ జాబ్ కేటాయించి ఉండాల్సింద‌ని కొందరు విమర్శిస్తున్నారు.


అయితే ఈ విష‌యంపై అక్క‌డి డీజీపీ సంజ‌య్ బ‌నివ‌ల్ స్పందించారు. ఆమె మెట‌ర్నిటీ లీవ్ తీసుకుని బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన అనంత‌రం ఒక నెల కింద‌టే విధుల‌కు హాజ‌రైంద‌ని తెలిపారు. ఆమె ఆ రోజు ఉద‌యం 8 గంట‌ల‌కు డ్యూటీలో రిపోర్టు చేయాల్సి ఉండ‌గా డ్యూటీకి  ఆలస్యంగా రావడంతో  ఆమె స్టేష‌న్‌కు రాకుండా నేరుగా డ్యూటీ చేసే ప్రాంతానికే వెళ్లింద‌ని తెలిపారు. అయితే డెస్క్ జాబ్ కావాల‌ని ఆమె  రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆ జాబ్‌కు ఆమెను మారుస్తామ‌ని తెలిపారు. అలాగే ఆమెకు చైల్డ్ కేర్ లీవ్‌లు కూడా ఉన్నాయ‌ని, కావాలంటే వాటిని సద్వినియోగం చేసుకోవచ్చని  తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: