ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట కొంతమంది వినడం లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. రాజకీయంగా వైసీపీ బలంగా ఉండటం కొంత మందికి ముఖ్యమంత్రి కాస్త ఎక్కువగా స్వేచ్చ ఇవ్వడంతో ఇబ్బందికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రాజకీయంగా వైసీపీని తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తుంది. ఈ తరుణంలో కూడా కొంతమంది నేతల నుంచి సహకారం పెద్దగా రావడం లేదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మున్సిపాలిటీలలో తెలుగుదేశం పార్టీ చాలా స్పీడ్ గా ముందుకెళ్తుంది. అయినా సరే అధికార పార్టీ నేతలు పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్న కొంతమంది నేతలు మాత్రం ప్రచారం చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించకపోవడం పట్ల తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. రాజకీయంగా ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మినహా రాష్ట్రంలో మరో ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు చూసే అవకాశాలు కూడా ఉంటాయి.

ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంది అనే అంశాన్ని తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి తీసుకు వెళ్తున్న సరే కీలక నేతలు ఎవరూ కూడా మీడియాతో మాట్లాడటానికి కూడా సాహసం చేయటం లేదు. దీని వలన క్షేత్రస్థాయి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఖరి పట్ల ప్రజల్లో ఆగ్రహం ఉంది. ముఖ్యంగా ప్రజల మీద ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ లేని విధంగా భారం వేస్తున్నారు అని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. దీనితో ప్రజలు కూడా ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో అధికార పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్కడా కూడా అధికార పార్టీ నేతలు అప్రమత్తంగా వ్యవహరించడం లేదు. ఇక మీడియా సమావేశం ఏర్పాటు చేసే విషయంలో కూడా కొంత మంది ఎమ్మెల్యేలు వెనకడుగు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: