ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. మహిళలు దేశానికి చేసిన, చేస్తున్న సేవలను గుర్తు చేసుకుంటూ మన దేశంలో మహిళా దినోత్సవం వేడుకలను  నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాల్లో మహిళా దినోత్సవ వేడుకలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏపీలో కూడా సిఎం వైఎస్ జగన్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రులు కూడా  మహిళా దినోత్సవం  కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక తెలంగాణా బీజేపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ ఘనంగా  నిర్వహించారుఈ కార్యక్రమం లో  విజయశాంతి సహా పలువురు బిజెపి మహిళా నేతలు హాజరయ్యారు.

కరోనా వారియర్స్ కు సత్కారం చేసారు. మహిళలకు మోదీ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోంది  అని వారు అన్నారు. ఎక్కడ మంచి జరిగినా అక్కడ బీజేపీ ఉంటోంది అని విజయశాంతి చెప్పుకొచ్చారు.  సమాజంలో చెడుని కూడా క్లీన్ చేయాలి (పారిశుద్ధ్య కార్మికుల నుద్దేశించి)  అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరటంలేదు  అని వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు  మేలు జరుగుతుంది అని విజయశాంతి ఆకాంక్షించారు.

విజయశాంతికి, కార్మికులకు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. మాస్క్ తీయమని పారిశుద్య కార్మికులు అడిగారు. విజయశాంతినా? కాదా పోల్చుకుంటామన్న కార్మికులు... మాస్క్ తీసి ఇప్పుడు ఒకేనా  అని అడిగిన విజయశాంతికి .. ఓకే అని సమాధానం ఇచ్చారు. దీనితో కాసేపు నవ్వులు పూసాయి. మీరంటే మాకు బాగా ఇష్టం అని వాళ్ళు చెప్పగా ధన్యవాదాలు చెప్పారు. రాములమ్మ సినిమా నాలుగు సార్లు చూశామన్న పారుశుద్య కార్మికులను... ఇంకా ఏయే సినిమాలు చూశారని అడిగారు విజయశాంతి.. చాలా సినిమాలు చూశామని కార్మికులు ఆమెకు సమాధానం ఇచ్చారు.  మీ సినిమాలు చూస్తే ధైర్యం వస్తోందని విజయశాంతికి మున్సిపల్ కార్మికులు చెప్పారు. మిమ్మల్ని అక్క, చెల్లెలుగా భావిస్తామని విజయశాంతితో  కరోనా వారియర్స్ చెప్పుకున్నారు. అందరితో కూడా కాసేపు రాములమ్మ ముచ్చటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: