విశాఖ నగర పాలక సంస్థకు పద్నాలుగేళ్ళ సుదీర్ఘ కాలం తరువాత ఎన్నికలు జరుగుతున్నాయి. జీవీఎంసీ ఏర్పడిన తరువాత కాంగ్రెస్ తొలి బోణీ కొట్టింది. అంతకు ముందు చరిత్ర చూసుకున్నా కాంగ్రెస్ రెండు సార్లు మేయర్ పీఠం అధిరోహించింది. ఇక విశాఖ మునిసిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయ్యాక  1981లొ  జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఫస్ట్ మేయర్ అయితే తెలుగుదేశం రెండవసారి  మేయర్ గా విశాఖలో గెలిచింది.

ఇపుడు జరుగుతున్న జీవీఎంసీ ఎన్నికల్లో ఎవరు విజేత అన్నది అత్యంత ఉత్కంఠను కలిగిస్తోంది. మేయర్ ఎన్నికల్లో తొలిసారిగా వైసీపీ పోటీ చేస్తూంటే తెలుగుదేశానికి ఇది అయిదవ సారి అనుభవం. దాంతో ప్రతీ వార్డులోనూ టీడీపీకి క్యాడర్ ఉంది. అలాగే లీడర్లు, మాజీ కార్పొరేటర్లు ఉన్నారు. ఇక టీడీపీకి ట్రెడిషనల్ గా ఓట్లున్నాయి. అలాగే కచ్చితంగా గెలిచే వార్డులు ఉన్నాయి. దాంతో పాటు సిటీలో ఎటు చూసినా తెలుగుదేశానికి బలం ఉంది. 2019 ఎన్నికల్లో కూడా నాలుగు ఎమ్మెల్యే సీట్లు టీడీపీయే గెలుచుకుంది. అయితే అందులో ఒకరు ఇపుడు వైసీపీలోకి జంప్ చేయడంతో పాటు, అనేక మంది సీనియర్ నాయకులు కూడా టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిపోవడంతో ఆ పార్టీ సిటీలో స్ట్రాంగ్ అయింది.

ఇక మరో వైపు చూస్తే జీవీఎంసీ పరిధిలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో వైసీపీకి అయిదు చోట్ల ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతో వైసీపీకి మొగ్గు ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఇవన్నీ కూడా రాజకీయ లెక్కలు. ఎమ్మెల్యేలు ఒక పార్టీకి ఉన్నంతమాత్రాన అక్కడ జనాలు ఆ పార్టీ వారినే గెలిపిస్తారని ఎక్కడా లేదు. దాంతో ఇపుడు చూస్తే కచ్చితంగా టీడీపీకి వైసీపీకి గట్టిగానే పోరు ఉంటుందని అంటున్నారు. మరి చూడాలి ఎవరు విజేత అవుతారు అన్నది. మొగ్గు చూస్తే రెండు వైపులా కనిపిస్తున్నా అధికార పార్టీ కాబట్టి వైసీపీకి సానుకూలం అవుతుందని ఒక బండ అంచనా కూడా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: