టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. మాటల్లోనే మీకు రాజధాని కావాలని  చేతల్లో ఏం చేయరు అని ప్రజలపై మండిపడ్డారు. 460 రోజులకు పైగా రైతులు ఆందోళన చేస్తుంటే మీరు ఏం చేశారు అని ఆయన నిలదీశారు. గుంటూరు వాసులకు స్వార్దం , పిరికితనం ఎక్కువ, రోషం లేదు అని ఆయన ఆరోపణలు చేసారు. ఒక ఉన్మాది చేతుల్లో అమరావతి బలైంది అన్నారు. కేసులు పెట్టి భయపెడతారు, ఓ రోజు జైలుకు వెళ్తే ఏమౌతుంది అని ఆయన నిలదీశారు. నా మీద కూడా కేసులు పెట్టారు అని ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నాను అంటూ వ్యాఖ్యలు చేసారు.

నేను భయపడే సమస్య లేదు అని, వడ్డి తో సహా తిరిగి చెల్లించే రోజులు వస్తాయి అని స్పష్టం చేసారు. గుంటూరు కార్పోరేషన్ లో వైకాపా గెలిస్తే అమరావతి ని వారికి రాసిచ్చినట్టే అని పేర్కొన్నారు. ఓ రౌడీ కి మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ ఇచ్చారు అని ఆయన ఆరోపించారు. గుంటూరు లో నానీ ఓడిపోతే వైకాపా వాళ్లు భరితెగిస్తారు అని మండిపడ్డారు. గుంటూరు వాళ్లు చేతగాని వాళ్లు అని విచ్చలవిడితనం చేస్తారు అని అన్నారు. సామాన్యుడు బ్రతికే పరిస్థితి లేకుండా నిత్యవసర ధరలు ఆకాశానికి అంటించారు అని మండిపడ్డారు.

కుక్క,పిల్లి, పంది పిల్లి, గాడిద పిల్లులకు కూడా పన్ను వేసే పరిస్థితి వస్తుంది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. మీకు రోషం లేదు 2వేలు డబ్బులు ఎవరూ ఇస్తే వాడికి ఓటు వేస్తారు అని, వాలెంటీర్ ను చూస్తే మీకు భయం అంటూ ఆరోపణలు చేసారు. భవన నిర్మాణ కార్మికులు పనులు లేక పడ్డ ఇబ్బందులు 2వేలు ఇస్తే మర్చిపోతారు అని, కరెంటు తీగ పట్టుకోవద్దని చెప్పినా వినలేదు అని అన్నారు. ఇప్పడు పిడుగుద్దులు తింటున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే ను నేను గెలిపిస్తే జగన్ కు అమ్ముడుపోయాడు అని ఆయన మండిపడ్డారు. ఒక్కడు పోతే వందమందిని తయారు చేస్తా అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: