కేంద్ర మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. గంగుల కమలాకర్ రేషన్ డీలర్ లకు ఒక్కొక్కరు 500 మంది గ్రాడ్యువేట్ ఓటర్ లు వేయించాలని  చెప్పడం ఎన్నికల కోడ్ ను ఉల్లగించడమే అంటూ మండిపడ్డారు. 2017 సర్పంచ్ ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో  25 శాతం ఓట్లు తొలగించిన  అధికారిని ఇప్పటికి  తొలగించలేదు అని అన్నారు. కచ్చితంగా ఆ అధికారిని తొలగించాలి అని డిమాండ్ చేసారు. బ్రాహ్మణ సంఘాలు,కుల సంఘాలతో   ప్రభుత్వ సలహాదారు రమణా చారి మీటింగ్ లు పెట్టి టీఆర్ఎస్ కు ఓటెయ్యమనడం ఎన్నికల నియమావళికి విరుద్ధం అన్నారు.

ప్రభుత్వ కార్యాలయం  అరణ్య భవన్ లో మంత్రి హరీశ్ రావు ను కలిసి గెజిటడ్ ఉద్యోగుల  టీఆర్ఎస్ కు ఓటు వేస్తామని చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అని నిలదీశారు.  జర్నలిస్ట్ లకు మేము వ్యతిరేకం కాదు ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు బాధిత జర్నలిస్టులకు ఆర్ధిక సహాయం చేయడం ఈ  సమయంలో  సరైనది కాదు అని  మర్రి శశిధర్ రెడ్డి  అన్నారు. ప్రతిపక్షాల తో ఒకతీరు అధికారపక్షం తో మరోలా వ్యవహరించడం మంచిది కాదు అని ఆయన ఆరోపించారు. భార్యా భర్తల ఓట్లు సీరియల్ గా ఇవ్వకుండా..ఇష్టానుసారం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఇవ్వడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి అని పేర్కొన్నారు.

ఓటర్  స్లిప్పుల్లో సరైన సమాచారం ఉండడం లేదు అని ఆరోపించారు. ఎన్నికల సంఘం అసమర్థత బయటపడుతోంది అన్నారు. అవసరమైతే న్యాయస్థానాలు ఆశ్రయిస్తాం అని స్పష్టం చేసారు. ఈవిధంగా పనిచేస్తే ఎన్నికల కమిషన్ ఉనికికే ప్రమాదం అన్నారు ఆయన. ఎన్నికల కమిషన్ కఠినంగా వ్యవహరించాలి అని ఆయన ఆరోపణలు చేసారు. ఎన్నికల కోడ్ అమలు లో ఉన్నప్పుడు  కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికిచ్చే సర్టిఫికెట్  పై ఉన్న మోడీ బొమ్మ ను తొలగించాలి అని ఆయన డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: