ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేయడమే కాకుండా చేసిన అప్పుల విషయంలో సమర్థించుకునే విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది కాస్త ఇబ్బందికరంగా మారిన అంశంగా చెప్పుకోవచ్చు. కొన్ని అంశాల విషయంలో చాలా వరకు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఆర్థిక మంత్రిగా చేసిన ప్రసంగం తీవ్రస్థాయి విమర్శలకు దారితీసింది అని చెప్పాలి. చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో ఆయన మీడియా ముందుకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేశారు.

దీనితో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అందించడానికి తాము బయట నుంచి అప్పులు తీసుకొస్తున్నామని అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. దీనిపై తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. సోషల్ మీడియాలో ఆర్థిక నిపుణులు కూడా ఇప్పుడు మంత్రి గారి ప్రసంగం పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాలు అప్పులు చేసి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేసే పరిస్థితి ఉండదని అనవసరంగా ఇప్పుడు రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని మండిపడుతున్నారు.

సంక్షేమ కార్యక్రమాల కోసం అప్పులు చేసే పరిస్థితి ఉంటే రాష్ట్ర భవిష్యత్తు లో ఊహించని విధంగా ఆర్థిక ఇబ్బందులు పడుతుంది అని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది అనే అంశం గనుక ప్రజల్లోకి వెళ్లింది అంటే మాత్రం ప్రతికూల ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు వీటిని సోషల్ మీడియాలో బాగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజల వద్ద నుంచే తిరిగి వసూలు చేస్తున్నారు అనే అంశాన్ని తెలుగుదేశం పార్టీ హైలెట్ వస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆదాయాన్ని కూడా సోషల్ మీడియాలో కొంతమంది అర్థమయ్యే విధంగా ప్రచారం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: