తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీకి సహకరించడం లేదు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కొంతమంది స్థానిక నేతలు కూడా పార్టీకి పెద్దగా సహకరించే ప్రయత్నం చేయకపోవడం పట్ల పార్టీ ఎక్కువ ఇబ్బందులు పడుతున్నది అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అర్థం చేసుకోవడం లేదు. పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా కొంతమంది నేతలు పార్టీ అధిష్టానానికి పెద్దగా సహకరించిన పరిస్థితి కూడా లేదు.

రాజకీయంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి జీవం పోసే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఆయనకు సహకరించకపోతే మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కార్యకర్తలను కూడా కలుపుకుని తెలుగుదేశం పార్టీ నేతలు ముందుకు వెళ్లాల్సిన తరుణంలో వర్గ విభేదాలు పెట్టుకుంటున్నారు అనే భావన కూడా రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే బయటికి వెళ్లిపోయే అవకాశాలు కూడా ఉండవచ్చని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గుంటూరు జిల్లాలో సరిగా పని చేయకపోవడం పట్ల చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా ఉన్నారట. ఈ నేపథ్యంలోనే ఆయనతో చర్చలు జరిపిన అధినేత పార్టీ నుంచి బయటకు వెళ్లి పోవచ్చు అని చెప్పినట్టుగా కూడా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన వైసీపీ నేతలతో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. అయితే వైసీపీలో కొంతమంది నేతలు కారణంగా అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి స్పష్టత కూడా రాలేదు. త్వరలోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉండవచ్చు. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: