టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాజాగా చేస్తున్న వ్యాఖ్య‌లు పార్టీకి ఏమేర‌కు క‌లిసి వ‌స్తాయి?  ఎంత వ‌ర‌కు పార్టీని గెలుపు గుర్రం ఎక్కి స్తాయ‌నే చ‌ర్చ ఒక‌వైపు సోష‌ల్ మీడియాలో జోరుగా చ‌ర్చ సాగుతోంది. అయితే.. అదేస‌మ‌యంలో చంద్ర‌బాబు వ్య‌వ‌హార శైలి.. ఆయ‌న వ్యాఖ్య‌ల వేడి.. పార్టీకి రివ‌ర్స్ అవుతాయా? అని పార్టీ సీనియ‌ర్లు గుస‌గుస‌లాడుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. విష యంలోకి వెళ్తే.. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌ను చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ప్ర‌ధానంగా విజ‌య‌వాడ‌, గుంటూరు, విశా ఖ న‌గ‌ర కార్పొరేష‌న్ల‌ను టీడీపీ ప‌రం చేసేందుకు ఆయ‌న శ‌త‌థా కృషి చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న నేరుగా రంగంలోకి దిగిపోయి.. రోడ్ షోలు నిర్వ‌హిస్తున్నారు.

దీనిని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌రు. చిన్న ఎన్నిక‌లే అయినా.. పార్టీ బ‌లోపేతానికి ఆయ‌న కృషి చేస్తున్న తీరును త‌ప్పుప‌ట్టాల్సిన అవ ‌సరం లేదు. అయితే.. ఈ సంద‌ర్భంగా రోడ్ షోల‌లో విజ‌య‌వాడ‌, గుంటూరు ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేస్తున్న కామెంట్లు మాత్రం పార్టీ లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. విజ‌య‌వాడ రోడ్ షోలో మాట్లాడుతూ.. ఆసాంతం అస‌మ‌నం, ఆగ్ర‌హం ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌జ‌ల‌ను మీకు మైండ్ ఉందా?  వైసీపీ నేత‌ల‌ను ఎలా ప‌ర్య‌టించేలా చేస్తున్నారు. మీకు మైండ్ ఉంటే.. అమ‌రావ‌తికి వ్య‌తిరేకంగా ఉన్న వైసీపీ అస‌లు పోటీ చేస్తుందా? అంటూ హాట్ కామెంట్లు కుమ్మ‌రించారు. విజ‌య‌వాడ ప్ర‌జ‌ల‌కు చీము నెత్తురు లేదా? అని ప్ర‌శ్నించారు.

ఇక‌, గుంటూరులోనూ.. యువ‌త‌ను రెచ్చ‌గొట్టే కామ్మెంట్లు చేశారు చంద్ర‌బాబు. ఇక్క‌డి యువ‌త వేస్ట్ అని కామెంట్లు చేశారు. రాజ‌ధాని కోసం నేను రోడ్డెక్కితే.. మీరు ఇంట్లో నిద్ర‌పోతున్నారు.. తిని తొంగోడ‌మేనా మీ ప‌ని.. ఎందుకు మీ బ‌తుకులు..? అని కామెంట్లు కుమ్మ‌రించారు. వాస్త‌వానికి చంద్ర‌బాబు ఆవేద‌న అర్ధం చేసుకోద‌గిందే. రాజ‌ధాని పోతోంద‌నో.. లేక పార్టీ ప్ర‌భావం త‌గ్గిపోయింద‌నో.. లేక వైసీపీ దూకుడు ముందు టీడీపీ దూకుడు లేని త‌నాన్ని ఆయ‌న ఆవేద‌న చెందుతున్నారో.. మొత్తంగా చంద్ర‌బాబు ఆవేద‌న క‌ట్ట‌లు తెగుతోంది.

ఈ ప‌రిణామం.. రాజకీయంగా చంద్ర‌బాబు మేలు క‌న్నా ఎక్కువ‌గా డ్యామేజీ చేస్తోంద‌న్న‌ది.. టీడీపీ సీనియ‌ర్ల గుస‌గుస‌. ``మా నాయ‌కుడు ఇదే మాట‌ల‌ను కొంత హీట్ త‌గ్గించి చెబితే బాగుండేది క‌దా! ఇప్పుడు వైసీపీ వాళ్లు చేస్తున్న వ్య‌తిరేక ప్ర‌చారంతో ఇబ్బందులు త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు`` అని రాజ‌మండ్రికి చెందిన ఒక సీనియ‌ర్ నేత వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈయ‌న చెప్పింది కూడా నిజ‌మే. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: