కోల్‌కతాలో జ‌రిగి భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య గంట‌గంట‌కూ పెరుగుతోంది. మంటల్లో చిక్కుకున్న ఫైర్ సిబ్బందితో సహా తొమ్మది మంది సజీవదహనమయ్యారు. కోల్‌కతాలోని తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయం దగ్గర  భారీ  అగ్ని ప్రమాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. న్యూ కోయిలా ఘాట్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెల‌రేగ‌డంతో సిబ్బంది అంతా కూడా చిక్కుకుపోయారు.  చనిపోయిన వారిలో నలుగురు అగ్నిమాపక సిబ్బంది, ఇద్దరు ఆర్పీఎఫ్ జవాన్లు, ఓ కోల్‌కతా ఏఎస్ఐ ఉన్నట్లు బెంగాల్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సేవల మంత్రి సుజిత్ బోస్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరగ్గా…. మంగళవారం ఉదయానికి మృతుల సంఖ్య 9కి చేరుకుంది.


 చనిపోయిన వారిలో నలుగురు అగ్నిమాపక సిబ్బంది, ఇద్దరు ఆర్పీఎఫ్ జవాన్లు, ఓ కోల్‌కతా ఏఎస్ఐ ఉన్నట్లు బెంగాల్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సేవల మంత్రి సుజిత్ బోస్ తెలిపారు. కోల్‌కతాలోని తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం సాయంత్రం 6 గంటల 30 నిముషాల సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. న్యూ కోయిలా ఘాట్‌ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈస్ట్రన్‌ రైల్వే, సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఈ కార్యాలయంలోనే కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఫైర్‌ సిబ్బందితో సహా తొమ్మిది మంది సజీవదహనమయ్యారు.


స్ట్రాండ్‌ రోడ్‌లోని 14 అంతస్థుల న్యూ కోయిలఘాట్‌ భవనంలోని 13 వ అంతస్థులో అగ్ని ప్రమాదం కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా పూర్తిగా దట్టమైన పొగ అలుముకుంది. రంగంలోకి దిగిన 25 ఫైరింజన్లు మంటలార్పేందుకు ప్రయత్నించాయి. భవనంలో మంటలు ఎగసిపడుతుండడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో తూర్పు జోన్‌లో కంప్యూటరైజ్‌డ్ టికెట్ బుకింగ్‌కు అంతరాయం ఏర్పడింది. తెల్లవారుజామున 6.10 గంటలకే తమకు సమాచారం వచ్చిందని, 10 అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకున్నట్టు ఫైర్ బ్రిగేడ్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. భవనంలోని 13 అంతస్తే మంటలు చెలరేగడానికి కారణమని తెలుస్తున్నా, ఇంకా నిర్ధారించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: