ఒక మళియాల నటుడితో ఓ ఐపీఎస్ అధికారిని ఫోటో దిగడంపై  పెద్ద వివాదం చెలరేగింది. వివాదాలకు కేంద్రబిందువుగా ఉండే కేరళ ఐపీఎస్ అధికారిణి మెరిన్ జోసెఫ్ తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. వివరాల్లోకి వెళితే... ఎర్నాకుళంలోని ఒక కాలేజ్ లో ఫంక్షన్ జరిగింది.  ఈ కార్యక్రమానికి కేరళ హోం శాఖ మంత్రి, ప్రముఖ హీరో నివిన్ పాలీతో పాటు అనేక మంది ప్రముఖులు హాజరైనారు. అయితే అక్కడకు తిరువనంతపురం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మెరిన్ జోసఫ్ కూడా వెళ్లారు. అక్కడ ఆమె హీరో నివిన్ పాలీతో ఫోటో దిగారు ఇప్పుడు ఇదే పెద్ద చర్చనీయాంశం అయ్యింది.  

 ఐపీఎస్ అధికారిణి మెరిన్ జోసెఫ్

Police Officer Merin Joseph Battles Controversy in Kerala

ఫోటోను మెరిన్ తన ఫేస్ బుక్ లో ఫోస్ట్ చేశారు. తరువాత అనేక లైక్ లు, కామెంట్లు వచ్చాయి. అంతలోనే ఎన్నో విమర్శలు చుట్టుముట్టాయి. కొందరు నెటిజన్లతో పాటు.. మీడియా కూడా విమర్శలకు శ్రీకారం చుట్టారు. యూనిఫాంలో ఉండి ఓ నటుడితో ఫోటోలు దిగుతారా? అంటూ విమర్శలు గుప్పించారు. ఆమె ప్రొటోకాల్ నిబంధనలు ఉల్లంఘించారంటూ మీడియాలో పలు కథనాలను ప్రసారం చేసింది. దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలన్న డిమాండూ పెరుగుతోంది. దీనిపై స్పందించిన మెరిన్ జోసెఫ్ మీడియా లేనిపోని రాద్దాంతం చేస్తున్నదని, తను ఏ తప్పు చెయ్యలేదని ఆమె అంటున్నారు.

ఈ కార్యక్రమానికి కేవలం ఓ అతిథిగా మాత్రమే వెళ్లాను. నాకేమీ అధికార విధులు అప్పగించలేదు.  ఇదంతా మీడియా చీప్ పబ్లిసిటీ కోసం చేస్తున్నదే. ఇందుకు నేను చింతిస్తున్నా. అంటూ మండిపడ్డారు. అయితే, అతిథిగా వెళ్లానని చెపుతున్న మెరిన్ జోసెఫ్.. యూనిఫాంలో ఎందుకు వెళ్లారన్నదే ఇపుడు చర్చనీయాంశంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: