ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసారు. నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహణ ఉంటుందని ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ పేర్కొన్నారు. మొదటి విడత  ఎన్నికల విషయానికి వస్తే... ఈ నెల 25 న నామినేషన్లు దాఖలు చేయాలని ఎన్నికల సంఘం పేర్కొంది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల దాఖలు చేయాలని సూచనలు చేసింది. 25 న ఓటర్ల జాబితా ప్రదర్శిస్తామని పేర్కొంది. 27 న నామినేషన్ల స్వీకరణకు అఖరు తేది సాయంత్రం 5 గంటల లోపు  అని స్పష్టం చేసింది.

28 న నామినేషన్ల పరిశీలన ఉంటుందని పేర్కొంది ఎన్నికల సంఘం. 29 న నామినేషన్ల తిరస్కరణ అని వివరించింది. అభ్యర్థుల స్వీకరణకు ఆఖరు తేది 31 ..అదే రోజు అభ్యర్దుల తుది జాబితా విడుదల చేయనున్నారు. పిభ్రవరి 5 న మొదటి విడత పోలింగ్  ఉంటుంది. ఉదయం 6.30 నుంచి మధ్యహ్నం 3.30 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. పిభ్రవరి 5 న ఓట్ల లెక్కింపు మధ్యహ్నం 4 గంటల నుండి  నిర్వహిస్తారు. ఎన్నికల సమయాన్ని ప్రజా అవసరాల ద్రుష్డ్యా ఉదయం  6.30 నుంచి మధ్యాహ్నం 3.30 దాకా సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియకు సన్నాహాలు చేస్తున్నాం అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు.

ఎన్నికలు ఏర్పాట్లు సంత్రుప్తిగా ఉన్నాయి అని ఆయన విశ్వాసం వ్యక్తం చేసారు. మధ్యాహ్నం మూడు గంటలకు సిఎస్ తో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తున్నాం అని అన్నారు. పని ఒత్తిడి ఉన్నా వారందరూ వస్తారని ఆశిస్తున్నాం అని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. ఎటువంటి సమస్యనైనా చర్చలతోనే‌ పరిష్కారమవుతాయి అని అన్నారు. రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ పనితీరు మెరుగగా లేదు అని ఆయన వెల్లడించారు. ఓటర్ల జాబితా ఫైనల్ చేయడంలో పంచాయితీ రాజ్ శాఖ పూర్తిగా‌విఫలమైంది అని అన్నారు. 2019 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నాం అన్నారు. నిన్న ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం  3 గంటలకు, సాయంత్రం 5 గంటలకు సమావేశం నిర్వహించినా పంఛాయితీ శాఖ అధికారులు రాలేదు అని,  ఓటర్ల జాబితా సరైన సమయంలో ఇవ్వని కారణంగా ఆ శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. సోమవారం సుప్రీంకోర్టు లో వాదనలు ఉన్న నేపద్యంలో ఎన్నికలను వాయిదా వేయాలనడం సహేతుకంగా లేదు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: