రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డంలో దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్ ఏం చేస్తున్నారు?  ఆయ‌న ఏమేర‌కు బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం గురించి ఆలోచిస్తున్నారు?  క‌నీసం వారి స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెడుతున్నారా? అంటే.. లేద‌నే అంటున్నారు బ్రాహ్మ‌ణులు. వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన వెలంప‌ల్లి దేవ‌దాయ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం హ‌ర్షం వ్య‌క్తం చేసింది. త‌మ స‌మ‌స్య‌లు తెలిసిన నాయ‌కుడు, త‌మ క‌ష్టాలు వింటార‌ని ఆశ‌లు పెట్టుకున్నా రు బ్రాహ్మ‌ణులు. దీనికి కార‌ణాలు ఉన్నాయి. గ‌తంలో దేవ‌దాయ శాఖ మంత్రులుగా ఇత‌ర సామాజిక వ‌ర్గాల ‌కు చెందిన నాయ‌కులు వ్య‌వ‌హ‌రించారు.

క‌మ్మ‌, కాపు సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నాయ‌కులు దేవ‌దాయ మంత్రులుగా చేయ‌డంతో ప్ర‌త్య‌క్షంగా బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లు వారికి తెలిసేవి కాదు. దీంతో బ్రాహ్మ‌ణులు ఏదైనా స‌మ‌స్య‌పై వారికి వివ‌రిస్తే.. వారు వాటిని ప‌రిశీలించి నిర్ణ‌యం తీసుకునేందుకు స‌మ‌యం ప‌ట్టేది. కానీ, వెలంప‌ల్లి స్వ‌త‌హాగా.. వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డంతో ఆయ‌న‌కు, బ్రాహ్మ‌ణుల‌కు ప్ర‌త్య‌క్ష సంబంధాలు ఉండ‌డంతోపాటు వారి స‌మస్య‌లు కూడా ఆయ‌న‌కు తెలుసు అని బ్రాహ్మ‌ణులు విశ్వ‌సించారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు కూ8919011959డా ఈ రెండేళ్ల కాలంలో వెలంప‌ల్లి బ్రాహ్మ‌ణుల‌కు చేసింది ఏమీ లేక పోవ‌డం గ‌మ‌నార్హం.

వెలంప‌ల్లి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోనే బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యం ఉంది. ఇక్క‌డ ప‌నిచేసే పురోహితులు, ఈ ప‌క్క‌నే ఉన్న కృష్ణాన‌దిలో శ్రాద్ధ విధులు చేసుకుని పొట్ట‌పోసుకునే పూజాలు వేల సంఖ్య‌లో ఉన్నారు. వీరంతా కూడా త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలంటూ.. అనేక సంద‌ర్భాల్లో ఆయ‌న‌కు మొర‌పెట్టుకున్నప్ప‌టికీ ఫ‌లితం ద‌క్క‌లేదు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కూడా వెలంప‌ల్లికి వీరంతా త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొచ్చారు. అయినా.. వాటిని కూడా వెలంప‌ల్లి ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు రాష్ట్ర‌వ్యాప్తంగా బ్రాహ్మ‌ణుల‌కు ర‌క్ష‌ణ కొర‌వ‌డింద‌నే వాద‌న వ‌స్తోంది.

క‌ర్నూలులో బ్రాహ్మ‌ణుల‌పై వైసీపీ నాయ‌కులు, ఈవో క‌ర్ర‌ల‌తో దాడి చేయ‌డం స‌హా.. రామ‌తీర్థం ఘ‌ట‌న‌లో పూజారును పోలీసులే స్టేష‌న్‌లో కూర్చోబెట్టిన ఘ‌ట‌న‌లు.. బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గాన్ని తీవ్ర ఆగ్ర‌హానికి గురి చేస్తున్నాయి. ఆయా అంశాల‌పై చ‌ర్చించేందుకు ఇటీవ‌ల మంత్రి వెలంప‌ల్లి అప్పాయింట్‌మెంట్ కోరినా.. త‌మ‌కు ఇవ్వ‌లేద‌ని వారు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దేవ‌దాయ శాఖ మంత్రిగా ఉన్న‌వెలంప‌ల్లి.. అటు దేవుడిని, ఇటు ఆదేవుడికి కైంక‌ర్యాలు చేసే పూజారుల‌ను విస్మ‌రించి.. ఇక‌, శాఖ ప‌రంగా ఏం చేస్తున్న‌ట్టు అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. 

బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి
తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకుhttps://www.indiaherald.com/ ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.


మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959
 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!

మరింత సమాచారం తెలుసుకోండి: