కృష్ణా జిల్లా జగ్గయ్య పేట దగ్గరలోని మక్కపేట గ్రామంలో గత ఏడాది సెప్టెంబర్ లో నంది విగ్రహం ధ్వంసం చేసిన కేసులో పోలీసులు ఒక గుప్తనిధుల ముఠాను అరెస్ట్ చేశారు. ఈ ముఠాని అరెస్ట్ చేయగా అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుప్తనిధుల కోసమే ముఠా ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టు గుర్తించారు. ఆలయాల్లో గుప్తనిధులు వుంటాయని నమ్మకంతో ఏడుగురు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడ్డారు.  ఆలయాల్లో గుప్తనిధులు, అది కూడా నంది విగ్రహం చెవులలో గాని లేదా పొట్ట భాగంలో గాని ఉంటాయని వీరికి ఉన్న సమాచారం.


 ఆ సమాచారం మేరకు ముందుగా మక్కపేటలోని శివాలయంలో ప్రవేశించి నంది విగ్రహం చెవులు ధ్వంసం చేశారు. అయినా వీరికి అందులో ఎలాంటి వజ్రాలు లభించలేదు. అయితే అప్పటికి పొట్ట భాగంలో వజ్రాలు ఉంటాయన్న సంగతి వీరికి తెలియదు చెవులలో వజ్రాల దొరక్కపోవడంతో వెనక్కి వెళ్ళిపోయారు. ఒక స్వామీజీని సంప్రదించగా చెవుల భాగంలో లేకపోతే పొట్ట భాగంలో వజ్రాలు ఉంటాయి అని సలహా ఇచ్చాడు. అయితే ఈ లోపు మక్కపేట లో ధ్వంసమైన నంది విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. అయితే పాత విగ్రహం పొట్ట భాగంలో వజ్రాలు ఉంటాయని భావించిన వీరు ఏకంగా నేరుగా అదే గుడికి వెళ్లి పూజ చేయించుకున్నారు.


అంతేకాక ఈ గుడిని నాలుగు కోట్లతో అభివృద్ధి చేస్తామని అందుకు గాను పాత నంది విగ్రహం తమకు ఇవ్వాలని ఈ ముఠా సభ్యులు పూజారిని కోరారు. వీరి మాటల మీద అనుమానం వచ్చిన పూజారి పోలీసులకు అందించాడు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి సీసీ కెమెరాల ద్వారా వీరిని గుర్తించి అరెస్టు చేశారు. అరెస్టు చేసిన అనంతరం వీరు శ్రీశైలం దగ్గరలో ఉన్న మహానంది విగ్రహాన్ని కూడా పగలగొట్టాలని ప్లాన్ చేశారు అని గుర్తించారు. ఇక ఈ దేవాలయమె కాక తెలుగు రాష్ట్రాల్లో చాలా దేవాలయాల మీద ఈ ముఠా కన్ను వేసిందని గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: