ఏపీ రాజకీయాల్లో కింజరాపు ఫ్యామిలీకి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు చేస్తున్న ఈ ఫ్యామిలీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. గతంలో దివంగత ఎర్రన్నాయుడు టీడీపీలో కీలక పాత్ర పోషించారు. ఇక ఆయన సోదరుడు అచ్చెన్నాయుడు కూడా పార్టీలో పెద్ద నాయకుడుగా ఎదుగుతూ వచ్చారు. అయితే మధ్యలో ఎర్రన్నాయుడు చనిపోవడంతో, ఆయన స్థానంలో రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎర్రన్న వారసుడుగా రామ్మోహన్ దూసుకెళుతున్నారు.


అతి తక్కువ కాలంలోనే రామ్మోహన్ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ విధంగా కింజరాపు ఫ్యామిలీ టీడీపీకి అతి పెద్ద సపోర్ట్‌గా ఉన్నారు. ప్రస్తుతం కూడా ఏపీలో టీడీపీ కష్టాల్లో ఉంది. జగన్ దెబ్బకు టీడీపీకి ఘోరమైన పరిస్తితి వచ్చింది. 2019 ఎన్నికల్లోనే టీడీపీ ఘోరంగా ఓడిపోగా, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం దారుణమైన పరాజయాలని చవిచూస్తుంది. ఇలా వరుసగా ఓడిపోతున్న టీడీపీని చంద్రబాబు ఎలాగోలా పైకి లేపాలని చూస్తున్నారు.


కానీ ఈయనకు నాయకుల నుంచి పెద్ద సపోర్ట్ రావడం లేదు. జగన్ దెబ్బకు చాలామంది నాయకులు సైలెంట్ అయిపోయారు. ఇప్పటికే చాలామంది నేతలు పార్టీ మారిపోయారు. మరికొందరు బయటకొస్తే వైసీపీ ప్రభుత్వం ఏ కేసు పెడుతుందా అనే భయంతో ఉండిపోయారు. దీంతో టీడీపీ బలోపేతానికి చాలామంది నేతలు కృషి చేయడం లేదు. అయితే కింజరాపు ఫ్యామిలీ మాత్రం బాగా కష్టపడుతుంది. వారు నిత్యం బాబు వెనుకే ఉంటున్నారు.


అచ్చెన్న, రామ్మోహన్‌లకు రాష్ట్ర స్థాయిలో మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో అచ్చెన్న రాష్ట్ర అధ్యక్షుడుగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. అటు రామ్మోహన్ సైతం తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలు తిరుపతి పార్లమెట్ ఉపఎన్నికలో గట్టిగా కష్టపడుతున్నారు. అధినేత వెనుకే ఉంటూ, పనబాక లక్ష్మీ విజయం కోసం కృషి చేస్తున్నారు. మొత్తానికైతే బాబాయి-అబ్బాయిలు తిరుపతిలో టీడీపీని నిలబెట్టాలని చూస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: