రాజకీయ పార్టీల స్థితిగతులు తెలుపడంలో సర్వేలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ప్రజల్లో తమ పార్టీ బలం ఎంత..? తమ పార్టీ క్యాడర్ లోని నేతలకు ప్రజల్లో ఎంతమేర సామర్థ్యం ఉంది..? అని తెలుసుకొనేందుకు ఆయా రాజకీయ పార్టీలు సర్వేలు చేయిస్తూ ఉంటాయి. ఆ సర్వేలలో వచ్చిన ఫలితాల అనుగుణంగా వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎన్నికల వేళ ఈ సర్వేలు పార్టీలపై తీవ్ర ప్రభావం చూపుతూ ఉంటాయి. దాదాపుగా సర్వేలలో వచ్చిన ఫలితాలకు అనుగుణంగానే ఎన్నికల్లో ఫలితాలు వస్తూ ఉండడంతో రాజకీయ పార్టీలు అన్నీ కూడా సర్వేలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. 

ఇలా ప్రజల నాడీ తెలియజేసే సంస్థలు చాలానే ఉన్నాయి. వాటిలో ఆత్మసాక్షి, ఇండియా టుడే, టైమ్స్ వంటి చాలా సంస్థలు నిష్పక్షపాతంగా సర్వేలు వెల్లడించడంలో కాస్త పేరు గాంచాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్ లోని రాజకీయ పార్టీల పని తీరుపై, ప్రజల అభిప్రాయాలను తెలుసుకొనేందుకు ఆత్మసాక్షి తాజాగా ఓ సర్వే నిర్వహించింది. 18-11-2020 నుంచి 6-1-2021 వరకు సుమారు 48 రోజుల పాటు సర్వే నిర్వహించగా ఈ సర్వేలో ప్రతి నియోజిక వర్గంలోని 1000 నుంచి 1300 వరకు శాంపిల్స్ సేకరించింది. ఈ శాంపిల్స్ లో 12 శాతం ఆన్లైన్ ద్వారా మిగతా 88 శాతం ప్రత్యేక్షంగా ప్రజలను కలిసి వారి అభిప్రాయాలను సేకరించింది.

ఇక ఈ సర్వేలో దాదాపుగా పది క్యాటగిరిల వారిగా ప్రజల అభిప్రాయాలను సేకరించినట్లు ఆత్మసాక్షి తెలిపింది. ఈ క్యాటగిరీలో, నిరుద్యోగులు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, ఉద్యోగస్తులు,  వ్యవసాయ దారులు, 18-25 సవత్సరాల ఓటర్లు, అలాగే 25 నుండి 45 సంవత్సరాల ఓటర్లు, వృద్దులు, స్త్రీ లను క్యాటగిరీల వారీగా సర్వే నిర్వహించడం జరిగిందని ఆత్మసాక్షి పేర్కొంది. అయితే ఎప్పుడు లేని విధంగా ఈ సారి వైసీపీ, జనసేన, బీజేపీ, టీడీపీ వంటి పార్టీల కార్యకర్తలలో సుమారు 8,750 మంది యొక్క అభిప్రాయాలను ప్రత్యేకించి సేకరించినట్లు తెలిపింది. అయితే ఈ సర్వేలో ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి. రాజకీయ పార్టీలలో వైసీపీ కి 44.5 శాతం, టీడీపీ కి 33 శాతం, జనసేన బీజేపీ కూటమికి 12.5 శాతం, ఇక ఎటు తెల్సుకోలేని వారు 10 శాతం ఉన్నారని సర్వే వివరాలు తెలిపాయి. అయితే ఎప్పుడు లేని విధంగా ఎటు తేల్చుకోలేని వారు 10 శాతం మంది ఉండడం గమనార్హం .

మరింత సమాచారం తెలుసుకోండి: