వ‌రంగ‌ల్ డీసీసీబీ స‌మావేశంలో మంత్రి ఎర్ర‌బెల్లి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. డోర్నకల్ నియోజకవర్గంపై వివక్ష చూపుతున్నారని, నిధులు విడుదల చేయడంలేదని రెడ్యానాయ‌క్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రబెల్లి కల్పించుకుని మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారని..? రెడ్యానాయక్‌ను ప్రశ్నించారు. అయితే తాను మంత్రి పదవి ఎవరి దగ్గర గుంజుకోలేదని, చ‌నిపోయినా ఆయ‌న అంటూ (దివంగత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉద్దేశించి) తనకు మంత్రి పదవి ఇచ్చారని రెడ్యానాయక్ చెప్పారు. మీకు త్వరలోనే మంత్రి పదవి వస్తుందంటూ ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. ‘‘మీరుండగా నాకు ఎలా వస్తుందంటూ రెడ్యానాయక్‌ పేర్కొ్నారు.


ఇప్పుడు రెడ్యానాయక్, ఎర్రబెల్లి సంభాషణపై రాజీకయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి గురించి రెడ్యానాయ‌క్ మాట్లాడుతుండ‌గా... ఎర్ర‌బెల్లి మంత్రి ప‌ద‌వి గురించి మాట్లాడ‌టంతో అంద‌రిలోనూ కొత్త చ‌ర్చ‌కు దారితీస్తోంది. త్వ‌ర‌లో మంత్రి వ‌ర్గంలో మార్పులు ఉండ‌వ‌చ్చ‌ని జ‌రుగుతున్న చర్చ నేప‌థ్యంలో ఎర్ర‌బెల్లి చేసిన వ్యాఖ్య‌ల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మంత్రి వ‌ర్గంలో మార్పులుంటాయ‌ని ప్ర‌చారం చాలా రోజులుగా జ‌రుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా ముగియ‌డంతో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్ప‌డింది.



ఏప్రిల్ 17న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరుగుతుంది. మేలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుంది.ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ నేతి విజయసాగర్, ఆకుల లలిత, కడియం శ్రీహరి, మహ్మద్ ఫరీదుద్దీన్, చీఫ్ విప్ బోడుకూడి వెంకటేశ్వర్లు కాల పరిమితి జూన్ మొదటి వారానికి ముగుస్తుంది. జూన్ 17కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పదవి కాలం ముగియనుంది. ఈ ఖాళీలను భర్తీ చేసిన వెంటనే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఖాయం అనే వాద‌నా ఉంది.  ప్రభుత్వ వర్గాలు. ఇందుకోసం ఇప్పటికే కేసీఆర్ కసరత్తు కూడా మొదలు పెట్టారని చెబుతున్నారు. మంత్రివ‌ర్గం రేసులో ఇప్ప‌టికే ఎమ్మెల్సీలు ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి, క‌విత పేర్లు బ‌లంగా వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: