ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది.  కరోనా వైరస్ నుంచి ప్రజలందరికీ రక్షించడానికి ప్రస్తుతం దేశంలో రెండు రకాల వ్యాక్సిన్ లను కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా  కొనసాగుతుంది.  అయితే వివిధ వేడుకలలో భాగంగా అందరికీ వ్యాక్సిన్ అందించే దిశగా ప్రస్తుతం ముందుకు సాగుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.  కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ క్రమంలోనే మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 45 ఏళ్ల పైబడిన వారికి వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను సిద్ధం చేసింది.

 ఈ క్రమంలోనే 45 ఏళ్ల పైబడిన వారందరికీ కూడా వ్యాక్సిన్ అందించే దిశగా అటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాయి. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా 45 ఏళ్లు నిండి ఉంటే వారికి కూడా వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది.  కేంద్ర ప్రభుత్వం 45 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్ వైద్యం అందించాలి అని నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ లో పనిచేస్తున్న 45 ఏళ్ల పైబడిన ఉద్యోగులకు వాక్సిన్ అందించేందుకు నిర్ణయించింది.


 తెలంగాణ ఆర్టీసీ సంస్థలో 45 ఏళ్లు పైబడిన ఉద్యోగులు అధికారులు దాదాపుగా ఇరవై ఏడు వేల మంది వరకు ఉన్నారని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి డిపో నుంచి కూడా 70 నుంచి 80 మందికి వ్యాక్సిన్ అందించే విధంగా కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అర్హత ఉన్న ఏ ఒక్క ఆర్టీసీ ఉద్యోగి కూడా వ్యాక్సిన్ మిస్ కాకుండా చూసే బాధ్యత ఆర్టీసీ అధికారులదే అంటూ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఎంతో మంది ఆర్టీసీ ఉద్యోగులు కూడా ప్రస్తుతం వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: