దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా ఇచ్చిన వ్యక్తి సబ్.ఈ మూవీ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పింక్ కు రీమేక్ గా వచ్చిన వకీల్ సాబ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా దిల్ రాజు బోనికపూర్ సంయుక్తంగా నిర్మించారు. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న వకీల్ సాబ్ రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు ఓవర్సీస్ లోనూ భారీగా కలెక్షన్లు రాబడుతోంది. మొదట ఈ సినిమా కబుర్లు చెప్పుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ లో  మాత్రం ఈ సినిమా ని అడ్డం పెట్టి పెద్ద రాజకీయం జరుగుతుంది. వకీల్ సాబ్ రిలీజ్ ముందు ఆంధ్రప్రదేశ్ లో ఓ రేంజ్ లో డ్రామా జరిగింది.


స్పెషల్ షో ల అనుమతుల్ని టికెట్ ధరల పెంపును రద్దు చేస్తూ  ఏపీ ప్రభుత్వం ఆకస్మికంగా ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే జాయింట్ కలెక్టర్లు నేరుగా థియేటర్ యజమానులను డిస్టిబూటర్స్ ని హెచ్చరిస్తూ నోటీసులు ఇచ్చారు. ఈ ఆకస్మిక పరిణామానికి పవన్ అభిమానులు షాక్ తిన్నారు. ఆ తర్వాత కోర్టుకు వెళ్లారు. దాంతో వకీల్ సాబ్  నిర్మాతలు పంపిణీ ఎగ్జిబిషన్ వర్గాలకు అభిమానులకు ఉపశమనం కలిగిస్తారు టికెట్ ధరను పెంచుకోవడానికి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం మొత్తం రాజకీయమే అంటున్నారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. తిరుపతి ఉప ఎన్నికల వేళ బిజెపికి మద్దతుగా రాజకీయం చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ను తాజాగా జగన్ సర్కార్ టార్గెట్ అన్నారు. పవన్ నటించిన వకీల్ సాబ్ మూవీకి జగన్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.


అయితే ఈ మేరకు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. వైసీపీ సర్కార్ పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వకీల్ సాబ్ కు మీరు షాక్ ఇస్తే తిరుపతిలో మీకు ఓటర్లు షాక్ ఇవ్వబోతున్నారు అంటూ బీజేపీ నేత విష్ణు చేసిన ట్వీట్ వైరల్  అయింది. తిరుపతిలో పవన్ స్టామినా పవర్ చూసి తట్టుకోలేకనే ఆయన  సినిమాను వైసీపీ సర్కార్ అడ్డుకుంటోందని విష్ణు ఆరోపించారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడు నడుస్తోంది వకీల్ సాబ్ సినిమా టికెట్ వ్యవహారం కాదు. తిరుపతి ఎంపీ టికెట్ ఎన్నికల వ్యవహారం అంటూ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తన ట్వీట్లో విమర్శలు గుప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: