ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి రెండేళ్లవుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 175 ఎమ్మెల్యేలకు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తూ జనం తీర్పు ఇచ్చారు. మరి రెండేళ్ల తర్వాత పరిస్థితి ఎలా ఉంది.. ఈ గెలిచిన 175 మంది ఎమ్మెల్యేలపై జనం అభిప్రాయం ఎలా ఉంది.. ఈ వివరాలు తెలుసుకునేందుకు అనేక పార్టీలు సర్వేలు చేయించుకుంటున్నాయి. ఇటీవల వైసీపీ చేయించుకున్న సర్వేలోనే తమ పార్టీకి చెందిన దాదాపు 30 మందికిపైగా ఎమ్మెల్యేలపై జనం ఆగ్రహంగా ఉన్నట్టు వెల్లడైందని వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు జిల్లాల వారీగా ఈ సర్వే ఫలితాలు వార్తల్లోకి వచ్చాయి. వైసీపీకి చెందిన మొత్తం 30 మందికిపైగా ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి ఉందట. ఇక ఆ సర్వే వివరాలు జిల్లాల వారీగా చూస్తే.. శ్రీకాకుళం జిల్లాలోని ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉందట. అలాగే ఓ టీడీపీ ఎమ్మెల్యేపైనా ఈ జిల్లాలో అసంతృప్తి ఉందని తెలుస్తోంది. ఇక విజయనగరం జిల్లాకి వస్తే ఈ జిల్లాలోని ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలపై జనంలో అసంతృప్తి ఉందట.

అలాగే విశాఖ జిల్లాలోని ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేపై జనం గుర్రుగా ఉన్నారట. ఇదే జిల్లాలో మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలైపైనా జనం ఆగ్రహంగా ఉన్నారట. తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై జనం ఆగ్రహంగా ఉన్నారట. ఇదే జిల్లాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలపైనా ప్రజలకు అసంతృప్తిగా ఉందని ఆత్మ సాక్షి సర్వే చెబుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే.. ఈ జిల్లాలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలపై జనం కోపంగా ఉన్నారట. ఇదే జిల్లాలో మరో టీడీపీ ఎమ్మెల్యేపైనా జనం అసంతృప్తిగా ఉన్నారని సర్వే చెబుతోంది.

కృష్ణా జిల్లాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలపైనా.. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలపైనా జనం అసంతృప్తిగా ఉన్నట్టు తేలుతోంది. గుంటూరు జిల్లాలోని ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలపైనా ఒక టీడీపీ ఎమ్మెల్యేలపైనా జనం అసంతృప్తిగా ఉన్నారట. ప్రకాశం జిల్లా జిల్లాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలపై జనం కోపంగా ఉన్నారట. ఇక నెల్లూరు జిల్లాలో ముగ్గుు వైసీపీ ఎమ్మెల్యేలపైనా.. కర్నూలు జిల్లాలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలపైనా.. కడప జిల్లాలో ఒక వైసీపీ ఎమ్మెల్యేపైనా.. చిత్తూరు జిల్లాలో ఇద్దరు, అనంతపురం జిల్లాలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్టు ఆత్మ సాక్షి సర్వే చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: