తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి ఈరోజు సాయంత్రంతో గడువు ముగుస్తోంది. అయితే తిరుపతి ఉప ఎన్నికల్లో మాత్రం పార్టీలు అభివృద్ధి అనే అంశాన్ని పక్కనపెట్టి బీజేపీ ఏమో మతం అంశం తెలుగుదేశం వివేకా మర్డర్ కేసు తెరమీదకు తీసుకు వచ్చి వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో కి ప్రయత్నం చేస్తున్నాయి.. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది. అయితే ముందు సాక్షి, ఇతర ఛానల్స్ కూడా దీనిని గుండెపోటు అని రిపోర్టు చేశాయి. అయితే అనంతరం ఆయన కుమార్తె రంగంలోకి దిగడంతో అసలు హత్య అనే విషయం బయటకు వచ్చింది. 

అయితే ఎన్నికల ముందు అప్పుడు టిడిపిలో ఉన్న ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి ఇలాంటి వారు ప్లాన్ చేసి ఆయనను హత్య చేశారని అప్పట్లో వైసీపీ ఆరోపించింది. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఈ విషయం మీద సీబీఐ ఎంక్వైరీ వేయాలని కూడా కోరారు. ఆ మేరకు కోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం తమకు మరక అంటుంది ఏమో అన్న ఉద్దేశంతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను నియమించాయి. ఆ తర్వాత అది అనేక మలుపులు తిరిగి ప్రస్తుతం ఈ కేసు సీబీఐ చేతికి చేరింది.

సిబిఐ చేతికి చేరకముందు అప్పట్లో వేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు జగన్. అదే అంశాన్ని టార్గెట్ చేస్తూ ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులు జగన్ మీద ముప్పేట దాడి చేస్తున్నాయి. లోకేష్ లాంటి వాళ్లు సైతం #whokilledbabai లాంటి స్లొగన్స్ జనాల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. లోకేష్ ఈ అంశం మీద వివేకా హత్య కు తనకు తన కుటుంబ సభ్యులు ఎలాంటి సంబంధం లేదని నిన్న తిరుపతి ప్రమాణం చేశారు. ఇదే విధంగా జగన్ వచ్చి ప్రమాణం చేయగలరా అని ఆయన సవాల్ చేశారు. కానీ జగన్ వైపు నుంచి కేవలం మంత్రి కన్నబాబు మాత్రమే కౌంటర్ ఇచ్చారు.

 తెలుగుదేశం అధికారంలో ఉండగా జరిగిన వైఎస్ వివేకా హత్య రాజకీయ అవసరాల కోసం తెలుగుదేశం వాడుకుంటోందని ధ్వజమెత్తారు.. అసలు లోకేష్ ప్రమాణం చేయాల్సింది వివేకా హత్య గురించి కాదని చాలా అంశాలు ఉన్నాయని చెబుతున్నారు, ఆ కోవలోనే ఎన్టీ రామారావును తండ్రి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి, పార్టీ లాక్కున్నారా? లేదా? అనే విషయం మీద, నందమూరి బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరగలేదని, పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరం ఘాట్ల వద్ద తొక్కిసలాటకు మాకు సంబంధం లేదని చేయాలని అంటున్నారు కానీ వివేక హత్యకు సంబంధించి వైసీపీ సరైన కౌంటర్ వేసుకోలేక పోతోంది అని మాత్రం చెప్పక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: