తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గాల ఇన్చార్జిలు పనితీరుకు సంబంధించి ఇప్పటికే అనేక అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. చాలా వరకు కూడా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి బాగాలేదు అనే వాళ్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తనకు అనుకూలంగా మార్చుకోవాలి అంటే దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీని ముందుకు నడిపించే నాయకత్వంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు తప్పులు ఎక్కువ చేస్తున్నారు అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.

 కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ లో స్థానికంగా సమస్యలు ఉన్నాయి. చాలా మంది నాయకులు ఓడిపోయిన తర్వాత ప్రజల్లోకి వెళ్లలేదు. పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా పార్లమెంటు అధ్యక్షులు పెద్దగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయలేదు. అంతే కాకుండా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు దూరంగానే ఉన్నారు. దీని వలన సమస్యలు పెరుగుతున్నాయి. కొంతమంది నాయకులు కూడా పార్టీ కోసం పని చేయడానికి ముందుకు రాక పోవడమే కాకుండా ఆర్థికంగా  బలంగా ఉన్న వాళ్లు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీనివలన క్షేత్రస్థాయిలో సమస్యలు పెరిగిపోయే అవకాశం ఉండవచ్చని కొంతమంది హెచ్చరిస్తున్నారు.

కాబట్టి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అలాగే టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అందరూ కూడా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లి నాయకులను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. కొంతమంది భయపడే పరిస్థితి కూడా ఉందని ముఖ్యమంత్రి జగన్ కి భయపడి చాలామంది బయటకు రావడం లేదని కొంతమంది అంటున్నారు. కాబట్టి ఈ సమస్యలను పరిష్కరించుకునీ తెలుగుదేశం పార్టీ ముందుకు వెళితే మంచి ఫలితాలు కూడా ఉండవచ్చు. మరి దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది చూడాలి. ఇదే పరిస్థితి భవిష్యత్తులో ఉంటే మాత్రం మళ్ళీ ఓడిపోయే అవకాశమే ఎక్కువగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: