రాజకీయంగా ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎటువంటి అడుగులు వేస్తారు ఏమిటి అనే దానిపై చాలా వరకు కూడా స్పష్టత లేదు అయితే నారా లోకేష్ విషయంలో తెలుగుదేశం పార్టీ నేతల అభిప్రాయం ఏ విధంగా ఉంది ఏంటి అనే దానిపై చాలా అనుమానాలు వస్తున్నాయి. తాజాగా టిడిపి రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించిన వీడియో ఒకటీ సోషల్ మీడియాలో వైరల్ గా మారినది. దీని వెనుక వాస్తవాలు ఏ విధంగా ఉన్నా సరే ఇది మాత్రం ఫేక్ వీడియో అనే వాళ్లు కూడా ఎక్కువగా ఉన్నారు. అయితే ఇప్పుడు నారా లోకేష్ పనితీరు విషయంలో తెలుగుదేశం పార్టీ లో చాలా వరకు కూడా సంతోషం వ్యక్తమవుతోందని అయితే కొన్ని కొన్ని అంశాల్లో నారా లోకేష్ మార్పులు చేసుకుంటే బాగుంటుంది అని కొంతమంది వ్యాఖ్యనిస్తున్నారు.

తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి నారా లోకేష్ స్థానిక నాయకులను కలుపుకుని రాష్ట్ర స్థాయి నాయకులను కలుపుకుని వెళ్ళలేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నారా లోకేష్ ఈ విషయమై దృష్టి సారించి రాష్ట్రస్థాయి నేతలతో ఆయన జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించే నాయకుడు అనే వ్యాఖ్యలు కూడా నారా లోకేష్ కు సంబంధించి ఎక్కువగా వినపడుతున్నాయి. కాబట్టి లోకేష్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించే విషయంలో చాలామంది వెనకడుగు వేస్తున్నారు. కాబట్టి నారా లోకేష్ అందరినీ కలుపుకొని వెళితే అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా అందరితో మాట్లాడటమే కాకుండా కార్యకర్తలతో సమావేశం నిర్వహించి స్థానిక నాయకులతో కూడా మాట్లాడితే మంచి ఫలితాలు ఉండవచ్చని కొంతమంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: