తెలంగాణ భారతీయ జనతా పార్టీలో విజయశాంతి ఏ విధంగా ముందుకు అడుగులు వేస్తారు ఏంటనేది అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో కూడా ఆమె పెద్దగా ప్రజల్లోకి వెళ్లి మాట్లాడిన పరిస్థితి లేదు అనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా ఆమె పెద్దగా ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు కనపడటం లేదని కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితులను పరిశీలిస్తే కొన్ని అంశాలు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మారే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి విజయశాంతిని సమర్థవంతంగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా కొంతమంది అంటున్నారు.

 అయితే ఆమెను ప్రచారకర్తగా చాలామంది చూస్తున్నారు. కానీ ఆమెకు ఒక నియోజకవర్గాన్ని అప్పగించి ఆమెను ముందుకు నడిపితే బాగుంటుందనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఉన్న పరిస్థితుల్లో విజయశాంతి వలన భారతీయ జనతా పార్టీకి ఎటువంటి ఉపయోగం కూడా లేదు. కాబట్టి ఆమెకు ఒక నియోజకవర్గాన్ని అప్పగించి ప్రజల్లోకి పంపిస్తే నియోజకవర్గంలో గెలిచే విధంగా అడుగులు వేసుకోవచ్చని ఆమెకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కేటాయించి అక్కడ ఆమె వెనక ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు ఉండవచ్చని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

గతంలో ఆమె అక్కడ ఎంపీగా పనిచేశారు. కాబట్టి ఇప్పుడు కూడా అక్కడి నుంచి పంపిస్తే మంచి ఫలితాలు వస్తాయి. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎంపీ స్థానాలు చాలా కీలకం. కాబట్టి విజయశాంతిని ఆ విధంగా వాడుకోవాల్సిన అవసరం ఉందని కొంతమంది అంటున్నారు. మరి ఆమె విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది చూడాలి. ఇప్పుడు విజయశాంతి నాగార్జున సాగర్ లో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నా ప్రజల్లో ఆదరణ రావడం లేదనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది త్వరలోనే స్పష్టత రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: