రాజకీయమని అందుకే అంటారు. ఎపుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నిన్న ఉన్నట్లుగా రేపు ఉండదు. ఇవాళ పోలింగ్ జరిగి మళ్ళీ రేపు రీ పోలింగ్ పెడితే ఒక్క రోజులోనే ఫలితాల్లో తేడాలు వస్తాయి. అందువల్ల ప్రతీ ఎన్నికా ఒక సవాలే. ప్రతీ పోరాటమూ ఒక గుణపాఠమే.

కానీ వైసీపీ తిరుపతి ఉప ఎన్నికను చాలా ఈజీగా తీసుకుంది. స్థానిక ఎన్నికల్లో గెలిచేశాం కాబట్టి ఈ ఎన్నికల్లోనూ ఆరు లక్షలకు తగ్గకుండా భారీ మెజారిటీతో అఖండమైన గెలుపు ఖాయమని భావించుకుంది. ఎక్కువగా ఊహించుకుంది. ఈ అతి నమ్మకంతోనే వైసీపీ బరిలోకి దిగింది. నిజంగా చెప్పాలంటే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చిన సమయానికి ఇప్పటికీ పరిస్థితిలో చాలా తేడా వచ్చింది అంటున్నారు

ఈ ఎన్నికలను చావో రేవో అన్నట్లుగా టీడీపీ తీసుకుంది. ఏపీలో ఉన్న మొత్తం టీడీపీ నాయకులను అందరికీ తిరుపతికి షిఫ్ట్ చేసి మరీ పోరాటం అంటే ఏంటో రుచి చూపించింది. చంద్రబాబు ఈ వయసులో చమటోడ్చిన తీరు నిజంగా హాట్సాఫ్ అన్నట్లుగానే ఉంది. చంద్రబాబుని ఎవరూ ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. చంద్రబాబులో ఉన్న కసి ఎప్పడూ ప్రత్యర్ధులకు డేంజరే.

ఆయన అనేక యుద్ధాల్లో ఆరితేరిన యోధుడు. ఇపుడు టీడీపీ పని అయిపోయింది అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటే. చంద్రబాబు ఒంటరిగా ఒక్కడూ కూడా పోరాటం చేయగలడు. అందువల్లనే తెలుగుదేశం పార్టీ తిరుపతిలో అనూహ్యంగా పుంజుకుంది అంటున్నారు. దాంతో వైసీపీకి ఇది హోరాహోరీ పోరుగా మారింది అంటున్నారు నూటికి ఎనభై శాతం ఓట్లు మాకే. మాది క్యాట్ వాక్ విజయమని వైసీపీ ఇపుడు అనుకోవడంలేదు. గత మెజారిటీ వచ్చినా అదే పదివేలు అన్నట్లుగా సీన్ ఉందని అంటున్నారు. మొత్తానికి చివరాఖర్లో వైసీపీ పరుగులు పెడుతోంది అంటున్నారు. మరి జనాల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: