తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల పర్వం కొనసాగుతూ ఉంది. రెండు రోజులలో అది కాస్తా పూర్తవుతుంది. నిన్నటితో ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు ఎన్నికలో మరో కోణం ఓటర్లకు డబ్బు పంపిణీ విషయంపై అందరి దృష్టి నెలకొంది. ఈ డబ్బు పంపిణీ కార్యక్రమం చట్ట పరంగా కరెక్ట్ కాకపోయినా ఎప్పటి నుండో ఈ పద్ధతి సాగుతూ ఉంది. ఈ పైసలిచ్చే కార్యక్రమం ఈరోజు సాయంత్రం నుండి రేపు సాయంత్రం వరకు జరుగుతుంది. కానీ ఈ నేపథ్యంలో భాగంగా ఇప్పటికే అధికార వైసీపీ డబ్బులు ఇవ్వబోమని పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు ప్రకటించింది. కానీ ఇంతకు ముందు జరిగిన ప్రచారం ప్రకారం ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ దాదాపు 70 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందని తెలిసింది. దీని ప్రకారం ఒక ఓటుకు 500 రూపాయలు పంచనున్నట్లు అంచనా.

ఎప్పుడైతే వైసీపీ ఈ ఎన్నికలకు డబ్బులు పంచడం లేదని చెప్పిందో, అప్పుడు టీడీపీ నాయకులు చంద్రబాబు సభలకు మనుషులని తీసుకురావడానికి భారీగా డబ్బు ఖర్చు పెట్టారు. ఈ రోజుల్లో మనుషులు డబ్బులు కోసం ఎవరి సభకు అయినా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టే చంద్రబాబు తిరుపతి సభకు జనం భారీగా తరలివచ్చారు. ఇకపోతే బీజేపీ పరిస్థితి తీసుకుంటే ఇంకా దారుణంగా ఉంది. వీరికి డబ్బులు ఇచ్చే వారే కరువయ్యారు. మొన్న నిన్నటి వరకు బీజేపీ తరపున పనిచేస్తున్న యువకులకు డబ్బులు ఇవ్వకపోవడంతో వారు మేము వైసీపీ తరపున పనిచేస్తాం అని హడావిడి చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం గుర్తించుకోవాలి. ఇప్పటి కాలంలో ఓటుకు డబ్బులు ఇవ్వనిదే కొన్ని ప్రాంతాలలో ఆఖరి వరకు ఓటు వేయని పరిస్థితి కూడా గతంలో చాలా సార్లు చూశాము.

దీని కారణంగా ఆయా పార్టీలకు ఓట్ల శాతం తగ్గడం పెరగడం జరిగే అవకాశం ఉంది. మొన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్  ఎన్నికల్లో వైసీపీ కొన్ని ప్రాంతాలలో మొదట డబ్బులు పంచడం లేదని చెప్పి, చివరి రోజున రాత్రికి రాత్రే విశాఖపట్నం, విజయవాడ మరియు గుంటూరు లలో కోట్ల రూపాయలు కుమ్మరించింది. కాబట్టి రాజకీయాలలో ఎవరూ చెప్పినట్టు చేయకపోవచ్చు. కాబట్టి వైసీపీ కూడా డబ్బులు పంచే అవకాశాలున్నాయని కొందరు చెబుతున్నారు. ఆ ప్రభావం అక్కడ ఫలితం ఎంతవరకు మారిందో మీకు తెలిసిందే. కాబట్టి చివరి వరకు ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. మరి ఏమి జరగనుందో తెలియాలంటే ఒక్క రోజు ఆగాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: