హాలియాలో రోడ్ షోలో విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేసారు. చావునోట్లో పెట్టి తెలంగాణ తెచ్చానని సీఎం కేసీఆర్ చెబుతున్నారు... కానీ చావుకు దగ్గర చేసింది తెలంగాణ ప్రజలనే అని ఆమె ఆరోపణలు చేసారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రాన్ని అనాథ ఆశ్రమంగా మార్చారు అని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలే కేసీఆర్ ను సీఎం కుర్చీలో కూర్చోపెట్టారు అని ఆమె అన్నారు. కాంగ్రెస్, టీఆరెస్ రెండూ ఒక్కటే, ప్రత్యామ్నాయంగా ఉన్న బీజేపీకి ఓటేసి గెలిపించాలి అని ఆమె కోరారు. హాలియాలో జానారెడ్డి కూడా మీడియాతో మాట్లాడారు.

అధికార పార్టీ ప్రవర్తన నన్ను బాధిస్తుంది, ఈ పరిణామం అధికార పార్టీ అనుభవించక తప్పదు అని ఆయన హెచ్చరించారు. నిన్న సీఎం దిగజారుడు రాజకీయలన్నారు అని మండిపడ్డారు. 30, 40 ఏళ్ళు శాంతి సామరస్యలు వెల్లివిరిసేలా పనిచేశాను అని ఆయన గుర్తు చేసుకున్నారు. కుర్చీ వేసుకుని కూర్చుని పూర్తి చేస్తా అని...హైదరాబాద్ లోనే కుర్చీ వేసుకుని కూర్చున్నాడు అని ఆయన ఆరోపణలు చేసారు. కేసీఆర్ చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించానంటున్నారు అని...

కానీ మా పార్టీని రెండు రాష్ట్రాల్లో చావు నోట్లో పెట్టి తెలంగాణ ఇచ్చింది మేము కాదా అని ఆయన నిలదీశారు. టిఆర్ఎస్ కు మేము పూర్తిగా సహకరించాము కాబట్టే తెలంగాణ వచ్చింది అని ఆయన చెప్పుకొచ్చారు. అధికార పార్టీ అహంకారానికి, నాగార్జున సాగర్ ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని ఆయన అన్నారు. సాగర్ లో జానారెడ్డి గెలుపు తధ్యం అని అన్నారు మానిక్కం టాగూర్. సాగర్ లో కేసీఆర్ పోలీస్, మనీ, లిక్కర్ పవర్ ను ఉపయోగిస్తున్నారు అని మండిపడ్డారు. నియంత్రించడంలోఎన్నికల సంఘం పూర్తిగా విఫలం అయింది అని ఆరోపించారు. ప్రజల పక్షాన జానారెడ్డి వాయిస్ అసెంబ్లీ లో ఉండాలి అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: