దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాజకీయంగా ఇప్పుడు కరోనా కేంద్రంగా విమర్శలు కూడా వస్తున్నాయి. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి కేంద్ర సర్కార్ ఎన్ని చర్యలు చేపట్టినా సరే ఫలితం మాత్రం ఉండటం లేదు. కరోనా కట్టడి విషయంలో దాదాపు అన్ని రాష్ట్రాలు సీరియస్ గా ఉన్నా సరే కరోనా తీవ్రత తగ్గడం లేదు. ఇక కొన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నా సరే కరోనా కేసులు ఆగడం లేదు. ఇక కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ కూడా విధించే ఆలోచనలో ఉన్నాయనే ప్రచారం కూడా ఎక్కువగానే జరుగుతుంది.

ఇక కరోనా కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తుంది అనే వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని 10 రాష్ట్రాలలో డబుల్ మ్యూటెంట్ కరోనా వైరస్ విజృంభణ  ఉందని కేంద్ర సర్కార్ గుర్తించింది. డబుల్ మ్యూటెంట్ వైరస్ తో విస్తృతంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అందుకే మరణాలు కూడా పెరిగాయని తెలుస్తుంది. గతంలో కరోనా వైరస్ వచ్చి తగ్గిన వారిలో మరోసారి కరోనా పాజిటివ్ వస్తుంది.

డబుల్ మ్యూటెంట్ వైరస్ తో 18 నుండి 45 సంవత్సరాలలోపు వారిలో మరణాల సంఖ్య  పెరుగుతుందని కేంద్రం పేర్కొంది. మహారాష్ట్ర,ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో ఉత్పరివర్తన జాతులు ఉన్నట్లు గుర్తించిన కేంద్రం.... కట్టడి దిశగా చర్యలు చేపట్టింది. COVID-19 కేసులు వేగంగా పెరగడంలో ఈ మార్పుచెందిన వైరస్ కలిగిన వారు కీలక పాత్ర పోషిస్తున్నారని వైద్య వర్గాలు అంటున్నాయి. ఢిల్లీ లో యుకె స్ట్రెయిన్ మరియు డబుల్ మ్యుటేషన్లతో కూడిన జాతులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: