తిరుపతి ఉప ఎన్నికల విషయంలో ఇప్పుడు కాస్త ఆసక్తికరంగా ప్రచారం జరిగింది. రాజకీయంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపధ్యంలో కొన్ని కొన్ని అంశాలు తిరుపతిలో సంచలనంగా కూడా మారుతున్నాయి. కరోనా కట్టడి విషయంలో కూడా ఏపీ సర్కార్ తిరుపతిలో విమర్శించడం హాట్ టాపిక్ గా మారింది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే బిజెపి కంటే కూడా ఇక్కడ ఎక్కువగా ప్రచారం నిర్వహిస్తుంది. కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతా మోహన్ అధికార పార్టీని ఎక్కువగా టార్గెట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం.

ఇక తాజాగా ఆయన ఎన్నికల ప్రచారం చివరి రోజు చంద్రబాబుని ఎక్కువగా టార్గెట్ చేసారు. డబ్బులు సంపాయించడం కోసం రాజకీయ పార్టీలా? అని నిలదీశారు. జగన్ తీరు సరిగా లేదు అని అన్నారు. ఇప్పటికే 99 తప్పులు చేసారు, ఇంకో తప్పు కూడా చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. తిరుపతిలో చెప్పులు లేకుండా తిరిగిన చంద్రబాబు  వేల కోట్లు ఎలా సంపాయించారు అని నిలదీశారు. నెల్లూరులో రాత్రి ఒక మంత్రి ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసి గూడూరులో ఓటర్లకు పంపిణీ చేయాలని చూస్తున్నారు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు

దాన్ని అరికట్టకపోతే మంత్రిని బర్తఫ్ చేయమని డిమాండ్ చేస్తున్నా అని వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు 500 రూపాయలు పంచాలని ప్రయత్నం చేస్తున్నారు, ఆపకపోతే టిడిపిని డీరికగ్నైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా అని వ్యాఖ్యలు చేసారు. మోడీ పెద్దమనిషి కాదు అని అన్నారు. ప్రజాస్వామ్య పునాదులను కదిలిస్తున్నారు అని విమర్శలు చేసారు. మోడీ,అమిత్ షాను ప్రజలు తరుముకునే రోజులు వస్తాయ్ అని, ఒక్క నయాపైసా కూడా ఓటుకు ఇవ్వము అని, క్యాష్ కు కరపత్రానికి మద్య యుద్దం అని స్పష్టం చేసారు. పాంప్లెట్ కు పైసల్ కు మద్య యుద్దంలో ఓటర్లు ఎటు ఉంటారో తెలుసుకోవాలి అని ఆయన వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ పార్టీ లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: