షర్మిళ ఉద్యోగ దీక్ష కు మద్దతు పలికిన బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ..అర్.కృష్ణయ్య... ప్రొఫెసర్ కంచే ఐలయ్య కీలక వ్యాఖ్యలు చేసారు. ఆర్ క్రిష్నయ్య మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు చనిపోతే 6 నెలల్లో ఎన్నిక జరిగినట్లే ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కాలపరిమితి ఉండాలి అని ఆయన డిమాండ్ చేసారు. గ్రూప్ 1,2, డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులకు మేలు చేసిన ఘనత వైఎస్ఆర్ కే దక్కుతుంది అని ఆయన అన్నారు. సమస్య ఏదైనా నిమిషాల్లో పరిష్కారం చూపించిన గొప్ప నేత వైఎస్ఆర్ అని చెప్పుకొచ్చారు.

ఐఏఎస్ అధికారులు డ్యూటీలు బందుపెట్టి రియలేస్టేట్ చేస్తున్నారు అని విమర్శలు చేసారు. 10 ఏళ్ళైన్నా సరే  గ్రూప్ 1, గ్రూప్ 2 వంటి ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు అని అన్నారు.  ఎమ్ఆర్ఓ ఆఫిసుల్లో క్లర్కులు లేని దౌర్భాగ్యం అని విమర్శలు చేసారు. వేల సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని అన్నారు. ఉపాధ్యాయులు లేక పిల్లలు రోడ్లపై ఆడుకుంటున్నారు అని విమర్శలు చేసారు. విశ్వవిద్యాలయాల్లో గెస్ట్ లెక్చర్ ల పేరుతో శ్రమ దోపిడీ జరుగుతుంది అని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలనే షర్మిళ దీక్ష పెట్టింది, అందరూ మద్దతుగా నిలబడాలి అని కోరారు.

మేధావులతో కళకళలాడాల్సిన ఉస్మానియా యూనివర్సిటీని బ్రష్టుపట్టించారు అని అన్నారు. ప్రయోగాలు చేసే ప్రొఫెసర్లు లేక వెలవెలబోతుంది అని వ్యాఖ్యలు చేసారు. విద్య, ఉద్యోగం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది  అని, యువతలో ఉన్న మేధోశక్తిని ఉపయోగించుకుంటేనే రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. రాజకీయ నాయకులకే పదవులు తప్ప నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం లేదు అని వ్యాఖ్యలు చేసారు. అన్ని ప్రభుత్వ విభాగాలు నిర్వీర్యమైనట్టు చెప్పారు. నిరుద్యోగులు రోడ్లెక్కి ప్రభుత్వం పై ఒత్తిడి పెంచినప్పుడే ఉద్యోగాలు వస్తాయి అని, ఇండ్లలో ఉన్నంతకాలం ఉద్యోగాలు రావు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: