ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల విషయంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు వినపడుతున్న సంగతి తెలిసిందే. వాలంటీర్లకు సంబంధించి ఇప్పుడు కొన్ని కొన్ని అంశాలను టీడీపీ నేతలు బాగా హైలెట్ చేస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వాలంటీర్ల విషయంలో ఏపీ సర్కార్ చాలా సీరియస్ గా ముందుకు వెళ్తుంది. ఇటీవల సిఎం వైఎస్ జగన్ వాలంటీర్లకు సత్కార కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీనితో వాలంటీర్ల విషయంలో ఏపీ సర్కార్ కి ఎంత శ్రద్ధ ఉంది అనేది స్పష్టంగా అర్ధమైంది. సిఎం వైఎస్ జగన్ ఎవరు ఎన్ని విమర్శలు చేసినా వెనక్కు తగ్గలేదు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది నుంచి కూడా వాలంటీర్లకు సత్కార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం లో  తూర్పు నియోజకవర్గ వాలేంటీర్ల సేవలకు సత్కార వేడుకలు నిర్వహించారు. పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి, దేవినేని అవినాష్,  మేయర్ రాయన భాగ్య లక్ష్మీ కీలక వ్యాఖ్యలు చేసారు. మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ వాలంటీర్ల‌ద్వారా ప్రభుత్వ పధకాలు ప్రజలకు నేరుగా  అందుతున్నాయిఅని అన్నారు.  అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పధకాలు అందిస్తున్నాం అని ఈ సందర్భంగా స్పష్టం చేసారు.

కోవిడ్ సమయంలో ప్రాణాలు సైతం  లెక్క చేయకుండా వాలంటీర్లు  సేవ చేశారు అని, ఇతర రాష్ట్రలు మెచ్చుకునెలా మీ పని తీరు ఉంది అని అన్నారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ... ప్రతి కుటుంబ లో సొంత వ్యక్తులు గా వాలంటీర్లు మారారు అని అన్నారు. చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థ ను తప్పు బట్టారు అని ఆయన చెప్పుకొచ్చారు. మీ సేవలు చూసి ప్రతిపక్షాలు వారు భయపడుతున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. జగన్మోహన్ రెడ్డి మీ మీద పెట్టుకున్న నమ్మ కాన్ని ఓమ్ము చేయకుండా పని చేస్తున్నారు అని, వాలెంటీర్లుకు ఏ సమస్య వచ్చినా మేము అండగా ఉంటాము అని హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: