ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంక్షేమ కార్యక్రమాల విషయంలో చాలా వరకు సీరియస్ గా ముందుకు వెళుతున్న సరే కొన్ని పరిణామాలు మాత్రం జగన్ ఇబ్బందికరంగా మారుతున్నాయి అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పరిస్థితులను జగన్ తనకు అనుకూలంగా మార్చుకునే విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని కొన్ని కీలక అంశాలను దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి కనబడటం లేదు. సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కొన్ని వర్గాల ప్రజలకు అందడం లేదు అనే భావన చాలా వరకు కూడా వ్యక్తం చేస్తున్నారు.

ప్రధానంగా అనేక నిబంధనలు పెట్టి కొంత మంది లబ్ధిదారులను తగ్గించారు అని దీని కారణంగా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని అంటున్నారు. వాస్తవానికి భూములు ఉన్న వాళ్ళు రాయలసీమ ప్రాంతంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా చాలామందికి ఇబ్బందులు ఉన్నాయి. కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా భూములు ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయినా సరే వాళ్లకు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు  అమలు కాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

కొన్ని కొన్ని సాంకేతిక కారణాలను చూపి కూడా లబ్ధిదారులకు తగ్గిస్తున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. వైసిపికి ఇటువంటి పరిస్థితి ఎంత మాత్రం మంచిది కాదని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా సరే ఇటువంటి చర్యల ద్వారా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయని కొంతమంది హెచ్చరిస్తున్నారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని టార్గెట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కాబట్టి జగన్ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి జాగ్రత్తగా లేకపోతే మాత్రం తీవ్ర నష్టం జరిగే అవకాశాలు ఉంటాయని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా మారుతాయి ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: