జాతీయ స్థాయిలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళ్లాలనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఇప్పుడు కొన్ని అంశాలు చంద్రబాబు నాయుడికి కాస్త ఇబ్బందికరంగా మారుతున్నాయి. ప్రధానంగా జాతీయ నేతలతో చంద్రబాబు నాయుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ మధ్య కాలంలో కొన్ని పరిస్థితులు చంద్రబాబు నాయుడు అనుకూలంగా మారుతున్నాయి అనే అభిప్రాయం కూడా కొంతమందిలో వ్యక్తమవుతుంది.

ముఖ్యమంత్రి జగన్ పై వ్యతిరేకత ఉంది అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలు గ్రహించారని అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో సాన్నిహిత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని కూడా కొంతమంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం ఏంటనేది దానిపై స్పష్టత లేకపోయినా మాత్రం బిజెపి కేంద్ర నాయకత్వం పరిశీలిస్తుందని చంద్రబాబు నాయుడుతో బీజేపీ నేతలు సమావేశమయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు అని కొంతమంది అంటున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు.

మూడో ఫ్రంట్ విషయంలో ఇప్పటివరకు ఎటువంటి అడుగు పడలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కొన్ని కొన్ని కీలక అడుగులు పడే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రతిపక్షాలు అన్నింటినీ కూడా ఏకం చేసే విధంగా ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు కాస్త జాగ్రత్తగా ముందుకు అడుగులు వేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆయనతో భేటీ అయ్యే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం జరుగుతుంది. కానీ ఈ టైం లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో కలిసే మాత్రం కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉండవచ్చు. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: