తెలంగాణ బిజెపి లో సమస్యలు పరిష్కారం విషయంలో కేంద్ర నాయకత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ భారతీయ జనతా పార్టీ చాలా వరకు బలంగా ఉన్నా సరే కొన్ని కొన్ని పరిస్థితులు మాత్రం భారతీయ జనతా పార్టీని వెనక్కి లాగుతున్నాయి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు తెలంగాణ భారతీయ జనతా పార్టీ లో కాస్త హాట్ టాపిక్ గా మారారు.

ఆయన ఎవరి విషయంలో కూడా వెనక్కు తగ్గే ప్రయత్నం చేయడంలేదు. బిజెపి నాయకులు అందరూ కూడా దాదాపుగా ఆయన మాట వినే పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం. రాజకీయంగా కిషన్ రెడ్డి చాలా వరకు బలంగా ఉన్నా సరే ఆయన విషయంలో బండి సంజయ్ వివాదాస్పదంగా వహిస్తున్నారని కొంతమంది అంటున్నారు. అయితే ఈ సమస్యల విషయంలో కేంద్ర నాయకత్వం దృష్టిపెట్టింది అనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. కొన్ని రోజులనుంచి దీనికి సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా మాట్లాడుతున్నారు అని అంటున్నారు.

హోం మంత్రి కూడా దీనికి సంబంధించిన కొంత సమాచారాన్ని సేకరించారని అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే  అంశాలను ఆయన పూర్తిగా పరిశీలించిన తర్వాత బండి సంజయ్ తో మాట్లాడే అవకాశాలున్నాయని ఇద్దరితో కలిసి కూర్చుని మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయాన్ని కూడా తీసుకునే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. అయితే కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుని మార్చాలని కోరుతూ ఉన్నట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ధర్మపురి అరవింద్ వైపు మొగ్గు చూపిస్తున్నారు అని కూడా రాజకీయవర్గాలు అంటున్నాయి. మరి ఈ విషయంలో బిజెపి కేంద్ర నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏ విధంగా అడుగులు వేస్తుంది అనేది చూడాలి. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: